ఆంధ్రప్రదేశ్ లో జనసేన టీడీపీల మధ్య పొత్తు ఉంటుంది అని అంతా కూడా అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి చుక్కలు చూపించేలా ఈ పొత్తు ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.ఇక మరీ ముఖ్యంగా విశాఖ జిల్లా విషయానికి వస్తే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుతో మెజారిటీ సీట్లు వైసీపీ పార్టీ కోల్పోతుందా అన్న చర్చ అయింతే ఉంది. విశాఖ జిల్లాలో మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇందులో 11 ఎమ్మెల్యే సీట్లను 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుచుకుంది.కేవలం సిటీలోని నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ పార్టీకి దక్కాయి.

ఇక 2014 వ సంవత్సరం ఎన్నికలను తీసుకుంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల కేవలం మూడు సీట్లు తప్ప మొత్తానికి మొత్తం కూటమి ఊడ్చేయడం జరిగింది. 2024 వ సంవత్సరంలో కూడా అలాంటి సీనే ఉంటుందా అన్నదే అందరి ఆలోచనగా ఇప్పుడు ఉందట. బీజేపీ పార్టీని పక్కనపెట్టి జనసేన టీడీపీ కలిసినా కూడా చాలా సీట్లు వైసీపీ పార్టీ మిస్ అవాల్సి ఉంటుంది అంటున్నారు.అందులో భీమిలీ మొదటి ప్లేస్ లో ఉంటుంది. అలాగే గాజువాక విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ విశాఖ ఈస్ట్ పెందుర్తి అనకాపల్లి ఎలమంచిలి ఇంకా చోడవరం పాయకరావుపేట వంటివి ఉంటాయని కూడా అంటున్నారు.

ఇక విశాఖ సౌత్ పెందుర్తి నర్శీపట్నం మాడుగుల ఏజెన్సీలోని రెండు సీట్ల మీద వైసీపీ పార్టీకి గ్యారంటీ ఉంటుందని కూడా అంటున్నారు.అంటే పొత్తుల ఎత్తులతో విశాఖలో మొత్తం 15 సీట్లకు గాను 9 సీట్ల దాకా టీడీపీ జనసేన కూటమికి కనుక దక్కితే మాత్రం వైసీపీ పార్టీకి రాజకీయంగా గట్టి షాకే అంటున్నారు. అయితే రాజకీయాల్లో గణిత శాస్త్రం అనేది ఎపుడూ పనికిరాదు. ఇక 2014 వ సంవత్సరం వేరు 2024 వ సంవత్సరం వేరు అని కూడా అంటారు. అపుడు వైసీపీ పార్టీ విపక్షంలో ఉంది. ఇక ఇపుడు అది అధికారంలో ఉంది. దానితో పాటు గతంలో కూడా బలం లేని చోట ఇపుడు పట్టు పెంచుకుంది.

అలాగే విశాఖ లాంటి టీడీపీ పార్టీ కంచుకోటలో కూడా ఇది పాగా వేసింది.ఇక దానికి తోడు టీడీపీ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూడా వైసీపీలో చేరిపోయారు. టీడీపీ పార్టీకి కొన్ని చోట్ల పూర్వం బలం లేదు అని అంటున్నారు. అందువల్లల జనసేన టీడీపీ పార్టీల పొత్తు గతంలో లాగా హిట్ అవుతుందా అన్నది కూడా వైసీపీ పార్టీ నేతల ప్రశ్నగా ఉంది. అయితే ఇది ఎవరికి కరెక్ట్ అవుతుంది ఎవరికి రాంగ్ అవుతుంది అన్నది మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంది. అయితే 2019లో ఆ పార్టీలకు పడిన ఓట్లను కనుక చూస్తే కచ్చితంగా ఈ సీట్లు కూటమికి వస్తాయనే అంతా కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: