తెలంగాణ ప్రజల్లో మళ్ళీ భయం పట్టుకుంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతూన్నాయి. దాంతో పాటుగా ఓమిక్రాన్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ను ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 92 శాతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేనని బయట పెట్టారు. ఈ నెల 3, 4 తేదీల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 90 నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపించగా.. అందులో 7.7 శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.


అందులో చాలా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కావడం గమనార్హం.. 90 శాతం ఒమిక్రాన్ కేసులు కావడం విశేషం. ఒమిక్రాన్‌లోనూ 'బిఎ1'కు చెందినవి 15, 'బిఎ2'కు చెందినవి 64, 'బి.1.1.529'కు చెందినవి 4గా తేలింది. ఈ విధంగా కేసులు పెరగడం తో ఆరోగ్య నిపునులు కూడా ఒక నిర్దారణకు వచ్చారు. ఈ కొత్త వేరియంట్ కారణం కూడా లేకపోలేదు.. ముఖ్యంగా వైద్యులను ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్కరికి ఈ మహమ్మారి వ్యాపిస్తుంది. మరో వైపు ప్రజలు కూడా భయం తో వణికి పోతున్నారు..


గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది ఇలా హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ కాలెజిలోని విద్యార్థుల కు ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. కరోనా రొగులను చూసుకుంటున్న వైద్యులకు కూడా కరోనా సొకింది.ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రం లో కొత్తగా 2,447 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656కు చేరింది. మొత్తానికి చూసుకుంటే కొలుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: