ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో నేతల ఫోటోలు కనిపించవు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించేవి.  పాలకులు మారినప్పుడల్లా ఆ ఫోటోలు ఆప్ డేట్ గా మారిపోయేవి. ఇది అందరికీ తెలిసిన విషమే. అయితే ఇక పై ఆఫీసుల్లో నేతలల ఫోటోలు కనిపించవు... ఎందుకో తెలుసా ?
 ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం అంబేద్కర్‌, భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉంటాయని, సీఎం ఫోటోలను ఆఫీసుల్లో పెట్టనివ్వమని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్  పేర్కోన్నారు బుధవారం జరగనున్న గణతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో  మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం కానీ రాజకీయవేత్తల ఫోటోలను పెట్టబోమని స్పష్టం చేశారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించాలన్న అంబేద్కర్ స్వప్నాలను నిజం చేసేందుకు తమ    ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు  కేజ్రీవాల్  తెలిపారు.

గడిచిన ఏడేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానీయా ట్రంప్ కూడా తమ స్కూళ్లను  చూసిందని పేర్రోంటూ,  ప్రభుత్వ బడులకు సర్టిఫికేట్ కూడా వచ్చిందన్నారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులను ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తామన్నామని ఆప్ అధినేత కూడా అయిన కేజ్రీవాల్ తెలిపారు. . గడిచిన 10 రోజుల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 20 శాతం తగ్గిందని, జనవరి 15న 30 శాతం ఉన్న ఆ రేటు  మంగళవారానికి 10 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఇది శుభపరిణామమని ఆయన తెలిపారు. . వ్యాక్సినేషన్ వల్ల ఆ పాజిటివిటీ రేటు అదుపులోకి వచ్చినట్లు సీఎం కేజ్రీవాల్ . చెప్పారు. పాలనా పరంగా చాలా మార్పులు తీసుకు వచ్చిన  ఆప్ ప్రభుత్వం ఢిల్లీ లోని సర్కారు బడుల్లో పెను మార్పులు తీసుకు వచ్చింది.  ప్రైవేటు కాన్వెంట్ల వైపు పరుగులు తీసే జనం, ప్రస్తుతం సర్కారు బడుల్లో చేరేందుకు క్యూలు కడుతున్నారు. భారత్ లోని పలు రాష్ట్రాలతో పాటు, వివిధ దేశాధినేతలు కేజ్రీ వాల్ చర్యలను హర్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: