గతమెంతొ ఘనం..నేడు దయనీయం అన్నట్లే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పరిస్తితి ఉంది...ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో యనమల ఒక వెలుగు వెలిగారు. టీడీపీలో కీలక నాయకుడుగా ఎదిగారు. వరుసపెట్టి తునిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు...అలాగే మంత్రిగా, స్పీకర్‌గా పనిచేశారు. టీడీపీలో పలు పదవులు అనుభవించారు. ఇలా టీడీపీలో తిరుగులేని నేతగా ఉన్న యనమల ఇప్పుడు...తన సొంత నియోజకవర్గంలో సొంత తమ్ముడుని గెలిపించుకోలేని స్థితిలో ఉన్నారు.

గత రెండు ఎన్నికల్లోనూ తునిలో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే...దీనికి కారణం స్వయం తప్పిదాలే అని చెప్పొచ్చు. ఏదో సొంత రాజ్యం లాగా తుని ప్రజలపై పెత్తనం చేశారు..అందుకే ఆ ప్రజలే యనమల ఫ్యామిలీని ఓడించి పక్కన కూర్చోబెడుతున్నారు. ఇంకోసారి కృష్ణుడుని రంగంలోకి దింపినా సరే...మళ్ళీ ఓడించడానికి తుని ప్రజలు రెడీగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసలు సొంత టీడీపీ కార్యకర్తలకే యనమల ఫ్యామిలీ మీద నమ్మకం లేదు.

వారు మళ్ళీ నిలబడితే తునిలో పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని ఇప్పటికే చంద్రబాబుకు సూచనలు కూడా చేశారు. కానీ సీనియర్ నేత కావడంతో చంద్రబాబు, యనమలని సైడ్ చేయలేకపోతున్నారు. కానీ ఏదొక మార్పు చేయకపోతే తునిలో టీడీపీ గెలుపు సాధ్యం కాదని తమ్ముళ్ళకు బాగా అర్ధమవుతుంది. ఇప్పటికే తుని ప్రజలు యనమల రామకృష్ణుడుని, ఆయన తమ్ముడు కృష్ణుడుని చూసేశారు. ఇంకో కొత్త అభ్యర్ధిని బరిలో దింపితే ప్రజలు ఏమన్నా ఆలోచించే ఛాన్స్ ఉంది.

ఈ క్రమంలోనే యనమల...తన కుమార్తె దివ్యని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని చూశారని, కానీ చంద్రబాబు ఇవ్వలేదనే ప్రచారం ఉంది. అయితే ఈ సారి తన సొంత నియోజకవర్గం తునిలోనే బరిలో దింపితే బెటర్ అని యనమల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే యనమల పనిచేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ సారి తుని బరిలో ఎవరు ఉంటారో?


మరింత సమాచారం తెలుసుకోండి: