అవుననే చెబుతోంది పాశ్చాత్య మీడియా. ఉక్రెయిన్ పై రష్యా గడచిన 12 రోజులుగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. తేలిగ్గా ఉక్రెయిన్ను దెబ్బ కొట్టేయచ్చని యుద్ధానికి దిగిన రష్యాకు ఉక్రెయిన్ సైన్యం చుక్కలు చూపిస్తోంది. ఏదో చిట్టెలుకే కదాని యుద్ధంలోకి దిగితే ఇన్ని రోజులైనా దేశం స్వాధీనం చేసుకోలేకపోవటంతో రష్యా అంచనాలు తప్పినట్లు అంతర్జాతీయ మీడియా దుమ్ము దులిపేస్తోంది.





ఉక్రెయిన్ను చాలా తేలిగ్గా తీసుకుని యుద్ధానికి దిగటంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు సైన్యంలో జనరల్ హోదాలో ఉన్న సెర్గీ షొయిగుయే కారణమని ఆరోపణలు మొదలైంది. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్ధను సరిగా అంచనా వేయకుండా సరైన ఇంటిలిజెన్స్ సమాచారం లేకుండానే షొయిగు రష్యా అధ్యక్షుడిని యుద్ధానికి ప్రేరేపించినట్లు సమాచారం.





రష్యా సైన్యం ముందు ఉక్రెయిన్ ఏమాత్రం నిలవలేదని కాబట్టి మూడు రోజుల్లో దాసోహం అంటాయని షొయిగు అధ్యక్షుడికి నివేదిక ఇచ్చారట. షొయిగు రిపోర్టును నమ్మిన పుతిన్ కూడా యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే యుద్ధం మొదలైన తర్వాత ఇన్ని రోజులు కంటిన్యు అవుతుండటమే రష్యాకు  నైతికంగా పెద్ద దెబ్బనే చెప్పాలి. చిట్టెలుకే కదాని యుద్ధంలోకి దిగిన రష్యా సైన్యాలను  ఉక్రెయిన్ సైన్యాలు ముప్పుతిప్పలు పెడుతోంది. వీళ్ళకు తోడు మామూలు జనాలు కూడా రష్యా వ్యతిరేకంగా యుద్ధ రంగంలోకి దిగేశారు. దాంతో రష్యా సైన్యానికి ముచ్చెటమలు పడుతున్నాయి. దాంతో రష్యా ఇపుడు యుద్ధంలో నుండి బయటపడటానికి నానా అవస్తలు పడుతోంది. 





12 రోజుల యుద్ధంలో 12 వేల రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే 300 యుద్ధ ట్యాంకులు, 40 విమానాలు, 48 హెలికాప్టర్లు, డజన్లకొద్దీ శతఝ్నులు ధ్వంసం అయిపోయినట్లు సమాచారం. యుద్ధంలో రష్యాకు ఇంత భారీ ఎత్తున నష్టం జరిగినా సక్రమమైన పద్దతిలో ఒక్క నగరాన్ని కూడా నూరుశాతం స్వాదీనం చేసుకోలేకపోయింది. మొత్తంమీద ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకే పెద్ద దెబ్బతిన్నట్లే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: