ప్రస్తుతం దేశంలో పెట్రోల్ బాదుడు ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్రజలు అందరికీ కూడా పెట్రోల్ బాధుడు భయపెడుతుంది. ఇక ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ఎంతో మంది సామాన్య ప్రజలు వాహనాన్ని బయటకు తియడం లేదు. అదే సమయంలో పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు సామాన్య ప్రజలు. ఇలా ఎంతలా విజ్ఞప్తి చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజల గురించి చేసింది మాత్రం ఏదీ లేదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక రూపాయి అటూ ఇటుగా పెట్రోల్ ధర 110 రూపాయలు కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ ధర కేవలం 54 రూపాయలకు మాత్రమే అందించారు. ఏంటి షాక్ అవుతున్నారు కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. లీటర్ పెట్రోల్ ని కేవలం 54 రూపాయలకే అందించడంతో ఇక జనాలు మొత్తం ఎగబడి పోయారు అని చెప్పాలి. నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే  పుట్టినరోజును ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయన 54 వ పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 54 రూపాయలకు విక్రయించారు. ఈ క్రమంలోనే క్రాంతి చౌక్  పెట్రోల్ బంక్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు కేవలం 54 రూపాయలకు మాత్రమే రోజంతా వాహనదారులకు పెట్రోల్ పోసారు. ఈ విషయం తెలిసి జనాలు ఎగబడ్డారు అని చెప్పాలి. అప్పటివరకూ వాహనంలో పెట్రోల్ పోసుకోవాలి అంటేనే భయపడిపోయే వారు.. ఇక ఈ ఆఫర్ కి బాగా ఆకర్షితులు అయ్యారు. ఈ క్రమంలోనే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు అని చెప్పాలి. ఇక ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి మరీ పెట్రోల్ కొట్టించుకోవడం గమనార్హం. ఈ ఆఫర్ గురించి తెలిసిన తర్వాత మీ ప్రాంతంలో కూడా ఎవరైనా ఇలాంటి ఆఫర్ పెడితే బాగుండు అనిపిస్తుంది కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: