ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న  విద్యాసంస్థల విషయంలో కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. అందులో ఏపీ  ర్యాంకు మరీ దారుణంగా ఉంది. ఏపీలోని ఏ ఒక్క విద్యా సంస్థ కూడా టాప్ ప్లేస్ లో నిలబడలేకపోయింది. ఆ మాటకొస్తే తెలంగాణ పర్ఫామెన్స్ కూడా పెద్ద గొప్పగా లేదు కానీ, ఏపీ కంటే మెరుగ్గా ఉంది. తాజాగా విడుదలైన ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఏపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంటే, తెలంగాణ మాత్రం దూసుకుపోయింది. తెలంగాణ టాప్ 2 ప్లేస్ లో ఉంది, కొన్ని సూచీల్లో నెంబర్ 1 స్థానంలో కూడా ఉంది. ఇక ఏపీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

తప్పెవరిది..?
అయితే టీడీపీ అనుకూల మీడియాలో ఏపీ ర్యాంకు పడిపోయిందని, తప్పు జరిగిపోయిందని, దీనికి కారణం జగనే అని రాస్తున్నారు. వాస్తవానికి కేంద్రం ప్రకటించిన ఈ రెండు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తప్పు నామమాత్రమే. విద్యాలయాల విషయంలో ఏపీకి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుండా కేంద్రం తప్పు చేసింది. కనీసం ప్రోత్సహకాలు కూడా లేవు. ఇక ఇన్నోవేషన్ ఇండెక్స్ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం కూడా గొప్పగా చేసిందేమీ లేదు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికే ఆ ఫలాలు, ఫలితాలు అందాల్సి ఉంది. కానీ అది కూడా జరగలేదు. సో ఇక్కడ జగన్ సర్కారుని వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు.

కానీ ఏపీ ర్యాంక్ తగ్గిపోతుందనే విషయం మాత్రం వాస్తవం. ఇప్పటికైనా దీనిపై వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. సంక్షేమం సరే, దానికి తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరందుకోవాలి కదా. అది జరక్కపోతే ఎన్నికల్లో ఓట్లు పడతాయి కానీ, యాభై ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏపీ ర్యాంకులు ఇలాగే ఉంటాయి. ఉత్పత్తి పెరగాలి, వ్యాపారవేత్తలకు ఏపీపై నమ్మకం పెరగాలి, ముఖ్యంగా కొత్త జనరేషన్, ఇన్నోవేషన్, ఐటీ కారిడార్ ఇవన్నీ ఏపీకి ముఖ్యం. అయితే రాజధాని లేకపోవడం వల్లే ఇలాంటివేవీ రావడంలేదనే వాదన కూడా ఉంది. ఆ విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందనే చెప్పాలి. విశాఖకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసేందుకు చూస్తున్నారు కానీ, హైదరాబాద్ కి ఆల్రడీ ఉన్న బ్రాండ్ కంపెనీలను అక్కడికే తీసుకెళ్తోంది. ఇక క్యాపిటల్ ఏంటి అనే ప్రశ్న వస్తే సమాధానం లేదు. కనీసం ఇలాంటి విషయాలపై అయినా ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది, ఆ సందర్భం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: