తెలంగాణా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు దాదాపు నిజమయ్యాయి. దాదాపు 20 సంస్ధలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదలచేశాయి. వీటిల్లో సుమారు 17 సంస్ధల రిజల్ట్స్ కాంగ్రెస్ దే అధికారం అని చెప్పాయి. అధికారం కూడా స్పష్టంగానే చేతికి అందుతుందని చెప్పాయి. అవిచెప్పినట్లుగానే తాజా ఫలితాలు వచ్చాయి. ఒ సంస్ధయితే కాంగ్రెస్ కు మ్యాగ్జిమమ్ 82 సీట్లు వస్తుందని చెప్పింది కానీ అంతరాలేదు.

నిజానికి ఇపుడు కాంగ్రెస్ కు వచ్చింది బ్రహ్మాండమైన గెలుపని చెప్పేందుకు లేదు. ఎలాగంటే అధికారంలోకి రావటానికి ఏ పార్టీకైనా 119 సీట్లలో 60 సీట్లు దాటాలి. అయితే కాంగ్రెస్ కు ఇపుడొచ్చిన 65 సీట్లు అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిందని చెప్పేందుకు లేదు. 60 సీట్లు దాటిన పార్టీకి అధికారం వస్తుందని అనుకుంటే కాంగ్రెస్ కు ఇపుడు వచ్చింది కేవలం 65 సీట్లు మాత్రమే. అంటే అధికారానికి అవసరమైన సీట్లకన్నా కేవలం ఐదు సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయంతే.

ఇందుకనే దీన్ని బ్రహ్మాండమైన విజయం అని చెప్పుకునేందుకు లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ సాధించిన  విజయం చాలా కీలకమనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను కాంగ్రెస్ ఓడిపోయింది. మూడోసారి ఎన్నికలో కూడా ఓడిపోతే కాంగ్రెస్ ను జనాలు మరచిపోతారనేట్లుగా తయారైంది పరిస్ధితి. ఇలాంటి సమయంలో భవిష్యత్తును ఊహించుకున్న కాంగ్రెస్ నేతలు, అభ్యర్ధులు ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాటంచేశారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సర్వే సంస్ధలు, మీడియా కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఒకవిధంగా వీటిని ఎగ్జిట్ పోల్స్ అనేకన్నా ప్రీపోల్ రిజల్ట్స్ అని అంటేనే బాగుంటుంది. ఏదేమైన మెజారిటి సంస్ధలు అంచనా వేసినట్లుగానే అంతిమ ఫలితాలు వచ్చాయన్నది వాస్తవం. ఈ విషయాన్ని ముందుగా ఊహించే కేసీయార్, కేటీయార్ కూడా మెంటల్ గా ఓటిమిని అంగీకరించటానికి సిద్ధపడిపోయారు. కాకపోతే మేకపోతు గాంభీర్యం చూపించారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: