తెలంగాణ ప్రజలు అద్భుతమైన తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించడం జరిగింది.ముఖ్యంగా కాంగ్రెస్ ని దగ్గరుండి మరి చూసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి.. అందుకు ఈయనకు సైతం ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ నేతల విజయం కోసం చాలా కష్టపడ్డారని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది.. అలాగే ప్రగతి భవన్ పేరును కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంగా మార్చుతామంటూ.. ఇకనుంచి ఇది ప్రజాభవన్ గా మార్చబోతున్నట్లు తెలియజేశారు.. ఎలాంటి సమస్య వచ్చినా సరే నైతికంగా అండగా ఉంటానని కూడా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.


రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో పలు ప్రాంతాలలో కూడా చాలా ప్రచారం బాగానే జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్చార్జిగా మాణిక్ రావు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సైతం నెరవేస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. డిసెంబర్ మూడవ తేదీన శ్రీకాంతాచారి అమరుడయ్యారు ఇవాల్టి ప్రజా తీర్పు ఆయనకే అంకితం అంటూ కూడా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రజలు పూర్తిగా తమకు సహకారం అందించాలని కూడా తెలియజేశారు. భారత్ జూడో ద్వారా కూడా రాహుల్ తమకు స్ఫూర్తినింపారని కూడా తెలియజేయడం జరిగింది.

ప్రతిపక్షంలో ఎవరు ఉండాలనే విషయాన్ని ప్రజల నిర్ణయిస్తారని ఈ విషయంలో 30 లక్షల నిరుద్యోగులు పట్టుదల కూడా ఉందని తెలంగాణ అమరవీరులకు ఇది అంకితం అన్నట్లుగా తెలియజేశారు.ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన విజయశాంతికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే తమ పార్టీలో అంతర్గత విషయాలను కూడా సమన్వయంతో పాటించి చేసినందుకుగాను ధాక్రే కు ధన్యవాదాలు తెలియజేశారు.CPI,CPM,TJS  లతో కలిసి ముందుకు వెళ్తా భారత్ జూడో యాత్ర కూడా రాహుల్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీనియర్ నాయకులు అందరి సహకారంతోనే ఈ కాంగ్రెస్ విజయం అందించింది అంటూ తెలియజేశారు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: