తెలుగుదేశంపార్టీ నేతలకు ఒక అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టుకుంది. అదేమిటంటే మీడియా మద్దతు. తమ్ముళ్ళు ఏమి మాట్లాడినా, ఏమీ మాట్లాడకపోయినా సరే వాళ్ళకి మంచి పబ్లిసిటీ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళ స్ధాయి ఏమిటనేది కూడా పట్టించుకోకుండా మొదటిపేజీల్లో అచ్చేస్తారు. ఇపుడు బీటెక్ రవి అనే తమ్ముడు మాట్లాడిన మాటలకు ఎల్లోమీడియా ఇచ్చిన ప్రధాన్యత అలాంటిదే. బీటెక్ రవి ఎప్పుడైతే జగన్ను టార్గెట్ చేసుకున్నారో అప్పటినుండే ఎల్లోమీడియా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయింది.

ఇంతకీ రవి ఏమన్నారంటే తనను చంపించటానికి జగన్ ప్లాన్ చేశారట. అందుకు పోలీసులను పావుగా వాడుకుంటున్నారట. తాను పులివెందులలో  పోటీచేయటాన్ని జగన్ సహించలేకపోతున్నారట. వ్యతిరేకంగా పోటీచేయనీయకుండా తన అడ్డుతొలగించుకోవాలని అనుకున్నట్లుగా రవి  ఆరోపించారు. అందుకనే తనను పోలీసులే కిడ్నాప్ చేసి పాయింట్ బ్లాంకులో తుపాకి పెట్టి రెండున్నర గంటలు విచారణ చేసినట్లు చెప్పారు. తనను పోలీసులు ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఏ అంశంపై విచారణ జరిపారు ? అన్నది మాత్రం రవి చెప్పలేదు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీటెక్ రవి పులివెందులలో పోటీచేస్తే జగన్ కు వచ్చే నష్టం ఏమిటి ? రవి ఏమీ ప్రజల్లో నుండి వచ్చిన నేత కాదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏవో నాలుగు పనులు చేసి డబ్బులు సంపాదించుకున్నారు. దాంతో ఓ పదిమంది మద్దతుదారులు తయారయ్యారు. ఇంతోటి దానికే తాను పోటీచేస్తే  ఓడిపోతానేమో అనే భయం జగన్లో పెరిగిపోతోందన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. జగన్ కు వ్యతిరేకంగా రవి కాకపోతే మరొకరు పోటీచేస్తారు కదా. దాదాపు ఐదు ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున సతీష్ రెడ్డి పోటీచేసిన విషయం తెలిసిందే.

ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీ మీటింగులో చంద్రబాబునాయుడు అండ్ కో స్పష్టంగా చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నపుడు కొట్టకపోయినా కొట్టినట్లు ఆరోపించి  నానా రాద్దాంతం చేయాలని. దాన్నే తమ్ముళ్ళు ఫాలో అవుతున్నారు. రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించుంటే అందుకు కారణాలు ఉండే ఉంటాయి. ఏ విషయంగా  అదుపులోకి తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం రవి చెప్పలేదు, ఎల్లోమీడియా రాయలేదంతే. అయితే తాజా మాటలు చూస్తే మాత్రం బీటెక్ రవి తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు మాత్రం అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: