రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ల విషయంలో  అధికారపార్టీలో అనేక మార్పులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేక సర్వేలు చేయించుకుని, లెక్కలు వేసుకుని కొందరికి టికెట్లు నిరాకరిస్తున్నారు. మరికొందరిని నియోజకవర్గాలు మారుస్తున్నారు. టికెట్లు నిరాకరించటం, మార్పులు చేయటం అంతా జగన్ ఆలోచనల ప్రకారమే జరుగుతోంది. జగన్ ఆలోచన ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవటమే. నియోజకవర్గాల్లో ఎంఎల్ఏలు, మంత్రులపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి నిర్మొహమాటంగా టికెట్లను నిరాకరించేస్తున్నారు.





దీనిపైన ఎల్లోమీడియా, చంద్రబాబునాయుడు అండ్ కో గోల గోల చేస్తున్నారు. వైసీపీలో మార్పులు జరుగుతుంటే మధ్యలో ఎల్లోమీడియా, చంద్రబాబుకు ఎందుకింత గోల చేస్తున్నట్లు ? ఎందుకంటే, వైసీపీలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల స్ధానంలో కొత్తవాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఇష్టంలేదు.  వాళ్ళ ఉద్దేశ్యంలో చాలామంది వైసీపీ ఎంఎల్ఏలపై బాగా వ్యతిరేకత ఉంది. మళ్ళీ వాళ్ళకే టికెట్లిస్తే ఓడిపోతారు. కాబట్టి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగులకే జగన్ మళ్ళీ టికెట్లివ్వాలి. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ+జనసేన కూటమి అభ్యర్ధులు గెలవాలి.





ఎలాగైనా వైసీపీ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నది ఎల్లోమీడియా బలమైన కోరిక. ఎందుకంటే వైసీపీనే రెండోసారి అధికారంలోకి వస్తే ఎల్లోమీడియా యాజమాన్యాలకు ఏపీలో ఫ్యూచరుండదు. అలాగే చంద్రబాబు, లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా అంథకారంలో పడిపోతుంది. తమను తాము రక్షించుకోవాలన్నా, టీడీపీ+చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తుండాలన్నా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాల్సిందే.





జగన్ చేస్తున్న మార్పులతో మళ్ళీ చాలా నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తుందేమో అనే భయం ఎల్లోమీడియా, చంద్రబాబులో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే సిట్టింగులకు జగన్ అన్యాయం చేశారని, ముఖ్యంగా ఎస్సీ, బీసీలకు అణిచేస్తున్నారంటు పదేపదే పిచ్చిరాతలు రాస్తున్నారు. ఎంఎల్ఏలకు ట్రాన్సఫర్లా అంటు చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారు. గతంలో ఇదే విధమైన ట్రాన్స్ ఫర్లను తాను చేసిన విషయాన్ని మరచిపోయారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్న జగన్ మళ్ళీ మరో ఎస్సీకే టికెట్ ఇస్తున్న విషయాన్ని ఎల్లోమీడియా చెప్పకుండా బురదచల్లేస్తోంది.





రాబోయే ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ అనుకున్నారు. అందుకనే బీసీలకు ప్రయారిటి ఇస్తున్నారు. మంగళగిరి, ఎమ్మిగనూరులో సిట్టింగ్ రెడ్డి ఎంఎల్ఏలను కాదని బీసీలకు టికెట్లు కేటాయించటం ఒక ఉదాహరణ. దీంతో బీసీలు వైసీపీకే జై కొడితే టీడీపీ+జనసేన గెలుపు సాధ్యంకాదని అర్ధమైపోయినట్లుంది. అందుకనే బీసీలకు అన్యాయం చేస్తున్నారు, తొక్కేస్తున్నారంటు ఎల్లోమీడియా పదేపదే నానా గోలచేస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: