ఇప్పుడు మళ్లీ తాజాగా ఒక దళిత కార్యకర్త పైన బాలకృష్ణ దాడి చేసినట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది .దీనిపైన పలువురి నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ బాలయ్యను తప్పుపడుతున్నారు.. అనంతపూర్ జిల్లా హిందూపూర్ నుంచి బాలకృష్ణ ప్రాతినిధ్య వహిస్తూ ఉన్నారు.గత రెండు ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలయ్య మూడవసారి కూడా పోటీ చేసేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు..
అందులో భాగంగానే పర్యటనలు కూడా చేపట్టారు.. ఒక ఇంట్లో కార్యకర్తలు నేతలతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే బాలయ్య అడ్డు తగిలారు. దీంతో బాలకృష్ణ కోపానికి గురైన ఆ కార్యకర్త పైన చేయి చేసుకుని మాట్లాడుతూ ఉండగా.. ఆవేశంగా తన మీదికి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు బాలయ్య.. ఆ కార్యకర్త పైన కూడా చేయి చేసుకున్న బాలయ్య ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోని పలువురు రాజకీయ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఒక దళిత నేత పైన ఇలాంటి చేయి చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది అలాంటప్పుడు దళిత నేత అని ఎలా చెబుతున్నారంటే ప్రశ్నిస్తున్నారు.. మరి కొంతమంది నువ్వు మారవా బాలయ్య అసలు ఏంటి ఇలాంటి చేష్టలు చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది టీడీపీ శ్రేణులకు ఎప్పుడు బాలయ్య చేతిలో చెంపదెబ్బలు తప్పడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి