జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టిడిపి బిజెపి కూటమిలో భాగంగా చంద్రబాబుతో కలిసి పలు రకాల సభలకు హాజరవుతూ మాట్లాడుతున్నారు.. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ భద్రత విషయం పైన కార్యకర్తలు అభిమానులు సైతం చాలా ఆందోళన చెందుతున్నారు. మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ తానంతటతానే తనకు భద్రత పెంచాలని అడగడం జరిగింది. ముఖ్యంగా బీజేపీతో పవన్ కళ్యాణ్ కు మంచి దోస్తీ ఉన్నది. అసలు టిడిపి పార్టీని బిజెపితో కలిపింది కూడా పవన్ కళ్యాణ్..


అయితే బిజెపి పార్టీ పొత్తు వల్ల ప్రయోజనం మాత్రం లోకేష్ పొందారు. లోకేష్ కు జెట్ క్యాటగిరి అందించారు. అదే పవన్ కళ్యాణ్ కు మాత్రం ఇంతవరకు ఇలాంటి క్యాటగిరి ఇవ్వలేదు. ఇప్పటికే తనను బ్లేడ్ల తో కోస్తున్నారనే విధంగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోజున అదే పవన్ ఫ్యాన్స్ ని బిజెపి మీదికి రెచ్చగొట్టే ప్రయత్నం .. పవన్ కు భద్రతేదీ అంటూ ఒక ప్రముఖ పేపర్ జ్యోతి  రాసుకు రావడం జరిగింది.అయితే పవన్ కళ్యాణ్ కు భద్రతకు లోట ఏమీ లేదని తెలుస్తోంది. అయితే తనకు ఉన్నటువంటి సెక్యూరిటీ తనకు ఉంటుందని.. కానీ జెట్ క్యాటగిరి సెక్యూరిటీ అన్నప్పుడు కచ్చితంగా అభిమానులను దూరంగా ఉంచుతారు. అలా ఉంచడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా అంటే.. కచ్చితంగా ఒప్పుకొంటారు. ఎందుకంటే ప్రమాదకరం కాబట్టే.. మొన్ననే పవన్ కళ్యాణ్ తనమీద బ్లేడ్ల దాడి జరిగే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. అందుకే జెట్ క్యాటగిరికి ఒప్పుకుంటారని వార్త వినిపిస్తోంది. బిజెపి అధిష్టాన అక్కడ హోం శాఖకు తెలియజేస్తే ఈ జెట్ క్యాటగిరి వస్తుంది. ఇంత వరకు అలా వచ్చినట్లుగా లేదు.. బిజెపి నాయకులు పైన ఒత్తిడి తీసుకురాకపోతే.. ఈ లోపు జనసేన కార్యకర్తలను ,అభిమానులనీ బిజెపి పై రెచ్చగొట్టడంలో జ్యోతి మరింత ముందుకు వెళ్లి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: