ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా ఏ సర్వే ఫలితాలు వచ్చినా ఆ ఫలితాలను తమకు మరింత బెనిఫిట్ కలిగేలా ప్రచారం చేసుకోవడంలో కూటమి అనుకూల మీడియా ముందువరసలో ఉంటుంది. రవిప్రకాశ్ తాజాగా ప్రకటించిన సర్వే ఫలితాలు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి రవిప్రకాశ్ సర్వేలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా అనే ప్రశ్నలకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం.
 
సర్వే ఫలితాల కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంతమంది ఓటర్ల అభిప్రాయం తీసుకున్నారు? ఈ సర్వేలను ఎప్పుడు నిర్వహించారు? ఏ అంశాల ఆధారంగా సర్వేలను నిర్వహించడం జరిగింది? అభిప్రాయం చెప్పని ఓటర్ల ఏ పార్టీకి అనుకూలంగా కౌంట్ చేశారు? ఈ సర్వే ఫలితాలకు భిన్నంగా వాస్తవ ఫలితాలు ఉంటే అప్పుడు ఏం చేస్తారు? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
 
2019 ఎన్నికలకు ముందు కూడా టీడీపీదే గెలుపు అంటూ పదుల సంఖ్యలో సర్వేల ఫలితాలు వెలువడినా చివరకు ఏమైందో అందరికీ తెలుసు. మెజారిటీ సర్వే సంస్థలు ఎలాంటి సర్వేలు చేయకుండానే తమ అభిప్రాయాలను సర్వే అభిప్రాయాలుగా చెబుతున్నాయిు. రాయలసీమలో 40 స్థానాలు వైసీపీవే అని తెలుస్తోంది. ప్రకాశం, కృష్ణా జిల్లాలలో సైతం మెజారిటీ స్థానాలలో వైసీపీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రవిప్రకాశ్ సర్వే ఫలితాలు నిజం కాకపోతే ఆయన విశ్వసనీయత కోల్పోయే ఛాన్స్ ఉంది. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తే మాత్రం రవిప్రకాశ్ నష్టపోతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవిప్రకాశ్ మాత్రం తాను ప్రకటించిన ఫలితాలు జెన్యూన్ అని ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని చెబుతుండటం గమనార్హం. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ రోజుకో సర్వే సంస్థ ఫలితాలను ప్రకటిస్తూ ఓటర్లను గందరగోళానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూటమి, వైసీపీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: