భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో విడత ఎన్నిక జరిగితే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు విడుదల లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహా మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి.

 అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని లక్ష్యంతో బిజెపి పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ దిశగా సక్సెస్ కూడా అవుతోంది బిజెపి. ఇలాంటి నేపథ్యంలో... బిజెపి పార్టీకి చెందిన ఓ ప్రముఖ సర్వే సంస్థ... తమ సర్వే లెక్కలను బయటపెట్టింది. ఈ సర్వే లెక్కల ప్రకారం కాంగ్రెస్కు అలాగే గులాబీ పార్టీ, ఇటు వైసిపి పార్టీకి  ఊహించని షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి.

 ఈ సర్వే లెక్కలు ఒకసారి పరిశీలిద్దాం. కేంద్రంలో కేవలం బిజెపి పార్టీకి 316 సీట్లు వస్తాయట. ఎన్డీఏ కూటమి ఓవరాల్ గా 369 సీటు వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఏడు సీట్లు తగ్గుతాయని... 42 సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపి అలాగే గులాబీ పార్టీలకు ఈ సర్వే సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది.

 తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పార్టీకి 11 ఎంపీ స్థానాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. ఎంఐఎం పార్టీకి ఒకే ఒక్క సీటు పక్కాగా రాబోతుందట. ఉద్యమ పార్టీ అయిన గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే వెల్లడించింది.

ఇది ఇలా ఉండగా...ఈ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలపై కూడా తమ రిపోర్టును విడుదల చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి... 14 సీట్లు వస్తాయట. ఇందులో తెలుగుదేశం పార్టీ 8 సీట్లు కైవసం చేసుకుంటుందట. బిజెపి పార్టీకి నాలుగు సీట్లు వస్తాయట. అటు జనసేన పార్టీకి రెండు సీట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp