ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికలు పూర్తికాగానే అందరి దృష్టి ఫలితాల పైన ఉంది. దీంతో గెలుపు పై ఎవరి దీమా వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి పార్టీలు. మరోసారి అధికారంలోకి వస్తామని వైసిపి చెబుతుంటే... జగన్ కోటలు బద్దలు కొడతామని కూటమి పార్టీలు చెబుతున్నాయి. అటు సర్వే రిపోర్టులు కూడా... కొన్ని తెలుగుదేశం కూటమికి పాజిటివ్గా ఇస్తే.. మరి కొన్ని వైసీపీకి అనుకూలంగా ఇచ్చాయి.
 

 దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.  అయితే మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వైసిపి పార్టీ...  ఇప్పుడు వారికి దూరంగా ఉంది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవడమే. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే... వైసిపి అలాగే.. బిజెపి పార్టీల మధ్య మరింత దూరం పెరుగుతుంది.

 

 ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే పరిస్థితి మాత్రం తలకిందులు అవుతుంది.  దేశంలో ఎలాగైనా మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకవేళ.. ప్రాంతీయ పార్టీల అవసరం వచ్చినా కూడా సపోర్ట్ ఇచ్చేందుకు చాలా పార్టీలు రెడీగా ఉన్నాయి. దీంతో... ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే... ప్రధాని నరేంద్ర మోడీ చెంతకు మరోసారి జగన్మోహన్ రెడ్డి వెళ్లే ఛాన్స్ ఉంది.

 

 ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి... అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా గెలిస్తే... కచ్చితంగా ఎంపీ సీట్లు భారీ స్థాయిలో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ ఎంపీలు అవసరం బిజెపికి కూడా ఉంటుంది. ఇటు కేసుల నుంచి తప్పించుకోవాలంటే కేంద్ర సహాయం అవసరం. ఇద్దరి  అవసరాల కోసం బిజెపి అలాగే వైసిపి పార్టీలు మళ్లీ కలవాల్సిందే. అప్పుడు తెలుగుదేశం నేతలకు... షాక్ తప్పదు. ఇలా అవసరం కోసం ఏ పార్టీ అయినా జతకట్టడం... అవసరం తీరాక విడిపోవడం  జరుగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: