ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం నిన్నటి రోజున చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తోపాటు చాలామంది సెలబ్రిటీలు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన మోడీ అమిత్ షా వంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి చేరారు. మెగా కుటుంబం మొత్తం ఇందులో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం తర్వాత స్టేజిపై ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకున్నది ప్రధాన మోదిని స్వయంగా తన అన్నయ్యకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం చిరు పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన మోది మెగా బ్రదర్స్ చేతులు పట్టుకొని కంగ్రాచులేషన్స్ అంటూ అభిమానం కూడా తెలియజేశారు.


ఆ సమయంలో చిరంజీవి తన తమ్ముడిని చూపిస్తూ ఉప్పొంగిపోయారు.అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. మోదీ తో కలిసి మెగా బ్రదర్ కు ఉన్న అనుబంధం చూసిన మెగా ఫాన్స్ చాలా సంబరపడిపోతున్నారు. అన్నదమ్ములంటే ఇలానే ఉండాలి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తరువాత తమతో మోడీ ఏం మాట్లాడారో చెబుతూ ఒక ఎమోషనల్ ట్విట్ ని షేర్ చేశారు చిరంజీవి.


ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ తోను తనతో ఈరోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడారని.. ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుతం విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినట్టి వీడియోని ఆయన చూశారని అది తనని చాలా బాగోద్వేగానికి గురి చేసిందని వెల్లడించారట. కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమాభిరాగాలను పంచుకున్న అ దృశ్యాలను చూసి కుటుంబ విలువలు ప్రతిబింబించాయని ఆ క్షణంలో ప్రతి ఒక్క అన్నదమ్ములు ఆదర్శంగా మీరు నిలుస్తారని తెలిపారుట.. అలా అనడం తనని చాలా ఆనందపరిచింది అంటూ చిరంజీవి వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒక ట్విట్ కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: