సోషల్ మీడియా వైసీపీకి పదునైన ఆయుధం అనంది అందరికీ తెలిసిందే.  మెయిన్ స్ట్రీమ్ మీడియా వైసీపీని పక్కన పెట్టిన రోజులలో ఒక బలమైన అస్త్రంగా సోషల్ మీడియా వైసీపీకి అండగా నిలిచింది.  వైసీపీ గురింది మంచిని జనాలకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్ధులు చేసే విమర్శలను ధాటీగా తిప్పికొట్టడంలో వైసీపీ సోషల్ మీడియా నిర్వహించిన పాత్ర గొప్పదనే చెప్పాలి.


2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి కూడా కారణం అయింది. అంతటి సోషల్ మీడియాని వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో దూరం చేసుకుంది. వారిని అసలు పట్టించుకోలేదు.  దాంతో పార్టీ కోసం అభిమానంగా పనిచేసిన వారు అంతా మెల్లగా సైలెంట్ అయిపోయారు. అది 2024 ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించింది.  అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ చేసిన మంచి పనులను కూడా చెప్పుకోలేక చతికిలపడింది.  ఇదంతా గతం. అయితే ఇపుడు మళ్లీ జగన్ సోషల్ మీడియా ఆవశ్యకతను గుర్తించారు అని అంటున్నారు.


పార్టీ క్యాడర్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ వరకూ అందరూ సొషల్ మీడియాలో ఉండాలని కోరారు. అంతా ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ వంటి సొషల్ మీడియా వేదికలతో కనెక్ట్ కావాలని దిశా నిర్దేశం చేశారు.


గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ ఏ రకమైన అన్యాయం ప్రజలకు జరిగినా వాటిని వెంటనే వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని జగన్ కోరారు. ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికి ప్రతీ ఇంట్లో ప్రజలు చంద్రబాబుని టీడీపీని ప్రశ్నించే స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా తన ప్రతాపం చూపించాలని జగన్ కోరారు.


మొత్తానికి చూస్తే సోషల్ మీడియాతో వైసీపీ కనెక్షన్ తెగింది అన్న సత్యాన్ని జగన్ బాగానే గుర్తించారు అని అంటున్నారు. గతంలో సోషల్ మీడియా ఎంతో శక్తివంతంగా ఉన్న నాడు దానిని పదిలపరచుకుని పటిష్టం చేసుకుని ఉంటే ఈ రోజున మళ్లీ ఈ రకమైన పిలుపు అధినాయకత్వం స్థాయిలో ఇచ్చి ఉండే అవకాశం వచ్చేది కాదు కదా అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: