ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నారాయణ విద్యాసంస్థల అధినేత కుమార్తె శరణి రచించిన  మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకావిష్కరణ వాటికి హాజరయ్యారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవికి తీవ్రంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి గతంలో చంద్రబాబుపైన చేసిన కొన్ని విమర్శలకు ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు సైతం చాలామంది నేటిజన్స్ సైతం ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడుని వెన్నుపోటుదారుడని, అవినీతిపరుడు అంటూ చాలా దారుణంగా విమర్శలు చేశారు. అయితే ఆ పార్టీ స్థాపనకు కారణాలు కూడా ఇవే అంటూ గతంలో తెలియజేశారు. కానీ ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణ సమయంలో చంద్రబాబు నాయుడును పొగుడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఆ పాత వీడియోని బయటికి తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు. గతంలో చిరంజీవి మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు వ్యత్యాసం ఎంత ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన  ఈ కార్యక్రమం లో  ప్రైవేటు విద్యాసంస్థలను పొగడడం సరైనది కాదు కేవలం ప్రభుత్వ విద్యా విధానాలను ప్రశంసించాలి అంటూ చాలామంది నేటిజన్స్ తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన మాటలు చిరంజీవి గౌరవాన్ని తగ్గించినట్లుగా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఏదో ఒక విషయంలో ట్రోల్స్ అవుతున్నారు. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ ఇలా పరోక్షంగా చేస్తున్నారనే విధంగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు.చిరంజీవి సినిమాల విషయానికి వస్తే  విశ్వంభర సినిమాతో పాటు డైరెక్టర్ అనిల్ రావు పూడితో ఒక సినిమాని చేస్తూ ఉన్నారు. సక్సెస్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: