వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి సొంత మీడియా వ‌స్తుంద‌న్న ప్ర‌చారం వైసీపీ అధికారం లో ఉన్న‌ప్ప‌టి నుంచే కొన‌సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఓ అధికారిణి విష‌యం లో విజ‌య సాయి రెడ్డి పై వ్య‌క్తిగ‌తంగా కూడా ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న ఓపెన్ గానే తాను కూడా ఓ మీడియా ఛానెల్ పెడుతున్న‌ట్టు చెప్పారు. ఇక ఇప్పుడు ఆయ‌న వైసీపీ కి దూర‌మ‌య్యారు. రాజ‌కీయంగా ఆయ‌న కొత్త నిర్ణ‌యాలు .. కొత్త ఆలోచ‌న‌ల తో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలో నే మ‌రోసారి ఆయ‌న మీడియా వ్య‌వ‌హారాలు .. కొత్త మీడియా గురించి చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. విజ‌య సాయి ప్ర‌స్తుతం బ్రాడ్ కాస్టింగ్ ప‌నుల‌పై బిజీబిజీగా ఉన్న‌ట్టు టాక్  ? హైద‌రాబాద్ - బెంగ‌ళూరు - ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయ‌న చ‌క్క‌ర్లు కొడుతున్నారు. గ‌తంలో ఓ కీల‌క ఛానెల్‌లో సీఈవోగా చేసిన వ్య‌క్తితో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ గ‌ట్టిగా న‌డుస్తోంది.


ఈ యేడాది ద‌స‌రా నాటికి ఆయ‌న వి-టీవీ పేరుతో సంస్థను ఏర్పాటు చేస్తార‌ని అంటున్నారు. ఈ ఛానెల్ ఫండింగ్ వ్య‌వ‌హారాలు అన్నీ కూడా ఉత్త‌రాదికే చెందిన ఓ బిజినెస్ మెన్ చూస్తున్న‌ట్టు కూడా ప్ర‌చారం న‌డుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల లో రాజ‌కీయాల‌లో రాణించాలి అంటే సొంత మీడియా అంటూ ఒక‌టి ఉండాల‌ని విజ‌య సాయి గ‌ట్టిగా భావిస్తున్నార‌ట‌. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న ఛానెల్ పెట్టాల‌ని బ‌లంగా తీర్మానిం చుకున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-చానెల్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని స‌మాచారం. అయితే దీనిపై పెద్ద గా హ‌డావిడి లేకుండా సైలెంట్ గా ఆయ‌న ముందుకు వెళుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: