
తెలంగాణ బోర్డర్లో ఏపీ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను సైతం నిన్నటి రోజున రాత్రి అధికారులు ఆపినట్లుగా తెలుస్తోంది. కృష్ణా నది బ్రిడ్జి పైన ధాన్యం లారీలు ఒక్కసారిగా చాలానే నిలిచిపోయాయట.దాన్యం లారీలు నిలిపివేయడంతో ఒక్కసారిగా అక్కడ ట్రాఫిక్ ఏర్పడడంతో కృష్ణ నది బ్రిడ్జి పైన లారీలు సైతం అడ్డంపెట్టి మరి డ్రైవర్లు ఆందోళన చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర నుంచి వస్తున్న ఈ ధాన్యపు లారీలను సైతం వెంటనే పంపించాలంటూ డ్రైవర్లు కూడా ఆందోళన చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు అక్కడ ట్రాఫిక్ ఏర్పడిందట.
వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని మరి సీజ్ చేశారు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పి మరి ఈ లారీలను సీజ్ చేశారట. అయితే ఈ లారీలను ఎందుకు సీజ్ చేశారు అనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఏపి ,తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్ర అధికారులు ఈ విషయం పైన స్పందించాల్సి ఉన్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా చాలా అన్యోన్యంగానే అన్ని విషయాలను అటు మంత్రులు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం పలు సందర్భాలలో మాట్లాడుకున్న విషయాలు కూడా ఉన్నాయి.