అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు కూడా హై టెన్షన్ వాతావరణాన్ని చూపిస్తూ ఉంటాయి. టిడిపి,వైసిపి నేతల మధ్య ఎక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తే జెసి ప్రభాకర్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఫైర్ అవుతూ ఉన్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇటీవలే హైకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ విషయం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి పై ఫైర్ కావడమే కాకుండా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఫైర్ కావడం జరిగింది.


వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చారని మీ శత్రువుని ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ రాంభూపాల్ పైన కూడా ఫైర్ అవుతూ నిలదీశారు జేసి ప్రభాకర్ రెడ్డి. అధికారంలో వైసిపి ఉన్నప్పుడు పెద్దారెడ్డి చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కాదు పుట్లూరు మండలంలో సోలార్ భూములను బలవంతంగా రైతుల దగ్గర నుంచి లాక్కున్నారని ఫైర్ అయ్యారు దివాకర్ రెడ్డి.. అలాగే తన అనుచరుడు పొట్టి రవికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసుల సహాయంతో ఐదేళ్లు తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ మాట్లాడారు.


తాడిపత్రిలో మహిళా కౌన్సిలర్ల పైన కూడా మర్డర్ కేసులు పెట్టించారు. జైలుకు పంపించిన ఘనత కూడా పెద్దారెడ్డిదే అని. పోలీసుల సహాయంతో టిడిపి కార్యకర్తల పైన రౌడీషీటర్లు ఇతరత్రా కేసులు కూడా బనాయించారని మాట్లాడారు. పెద్దారెడ్డి రైతుల నుంచి అక్రమంగా గుంచుకున్న భూముల ఫెన్సింగ్ కూడా పీకేస్తానని.. తాను ఆక్రమించుకున్న మున్సిపల్ స్థలాన్ని కూడా ఆక్రమించుకుంటానని.. తన ఇంటిని కూడా కూల్ చేస్తానని ఫైర్ అయ్యారు.. తన బస్సు ఐదేళ్లు ఆపినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా తన గురించి మాట్లాడలేదు  అంటూ ఫైర్ అయ్యారు. గతంలో పెద్దారెడ్డి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫ్యాక్షన్ చేస్తానని చెప్పారు.ఇప్పుడు తాడిపత్రికి రావాలి ఆయన ఫ్యాక్షన్ చేయాలి అంటు జెసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: