
భారతీయ స్త్రీల కుంకుమ బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దైవంలా భావించే భర్తలకు గుర్తుగానే తమకు నుదుటిన ఈ కుంకుమను సైతం ధరిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలకు చిహ్నంగా ప్రాణానికి ప్రాణంగా భావించే ఈ కుంకుమని.. పహల్గాంలో ఉగ్రముకలు దాడి చేసి మహిళలను సైతం వదిలివేసి వారి భర్తలను టార్గెట్ చేసి వారి నుదుటిన బొట్టు లేకుండా చేసిన ఉగ్రవాదుల కోసమే ఆపరేషన్ సింధూర్ అని ఒక కోడ్ నేమ్ మాత్రమే తీసుకున్నారట. అయితే ఇది భారతీయ మహిళల గౌరవాన్ని కూడా కాపాడేందుకే ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పేందుకే కాకుండా భారతమాత బిడ్డలను క్రూరంగా చంపారో ఆడబిడ్డలకు కుంకుమ లేకుండా చేశారో వారిని కచ్చితంగా శిక్షిస్తామంటూ ప్రధానమోది వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
బొట్టు పోగొట్టుకున్న మహిళలందరికీ అన్నలాగా ఇంటి పెద్దగా భరోసా ఇస్తామని సంకేతాలతోనే ఈ సింధూర్ ఆపరేషన్ ని మొదలుపెట్టారట. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ సాయుధ దళాలు, పౌరుల భద్రతను కాపాడేందుకు సైతం సిద్ధంగానే ఉన్నామని చెప్పేందుకే ఈ కోడ్ నేమ్ పెట్టారట. భారత్లో ఉండే మహిళలకు భరోసాగా ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం దాడి చాలామంది భారతీయులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. ముఖ్యంగా అక్కడ మహిళలు కన్నీళ్లలో నుంచే వచ్చిన నీటి నుంచే పుట్టిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఇలాంటి భయంకరమైన ఉగ్రదాడి తర్వాత అటు రక్షణ దళ వైమానిక దళం సంయుక్తంగా ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో ఆక్రమిత తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపైన క్షిపణులతో దాడి చేశారు.