ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంలో మురళి నాయక్ అనే జవాన్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ కాల్పులలో అగ్నివీర్ మురళి నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. తన మరణంతో భారతదేశంలోని ప్రతి ఒక్కరు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మురళి నాయక్ కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మురళి నాయక్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. వీర జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి లకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చెప్పారు. 

మురళి నాయక్ చేసిన త్యాగానికి ప్రతి ఒక్కరూ గర్విస్తున్నారని భారతదేశం ఎప్పుడు మురళి నాయక్ కు రుణపడి ఉంటుందని జగన్ చెప్పారు. మురళి నాయక్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని జగన్ వ్యాఖ్యానించారు. ఇక జగన్మోహన్ రెడ్డి మురళి నాయక్ కుటుంబ సభ్యులకు భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని చేశారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం 50 లక్షలు సహాయం చేసినందుకు జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. అమరవీరుల కుటుంబాలకు 50 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు.

ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ ఆ విధానాన్ని అలానే కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయలను జగన్మోహన్ రెడ్డి వారి వంతుగా అందజేస్తామని అనౌన్స్ చేశారు. వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పారు. ఎలాంటి సందర్భంలోనైనా సహాయం చేయడానికి ముందుంటానని జగన్ మోహన్ రెడ్డి చెప్పడంతో మురళి నాయక్ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తామని అన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనిని చూసి తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: