వైసిపి నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్ గత కొద్దిరోజులుగా ఏదో ఒక కేసులో అరెస్ట్ తో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి నందిగామ సురేష్ పైన తాజాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. నందిగామ సురేష్ తన పైన దాడి చేశారంటూ టిడిపి కార్యకర్త ఇసుకపల్లి రాజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారట. దీంతో మరొకసారి సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలుస్తోంది.


అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ సురేష్ సొంత గ్రామం అయిన ఉద్దండరాముని పాలెంలో మాజీ ఎంపీ సురేష్ ఇంటి వద్ద పెద్ద గొడవ జరిగిందని ఇక ఈ దాడిలో టిడిపి కార్యకర్త అయిన ఇసుకపల్లి రాజు పైన సురేష్ చేయి చేసుకున్నారనే విధంగా తెలియజేశారు. గాయపడిన బాదితుడు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటన ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సురేష్ ని సైతం అదుపులోకి తీసుకోగా ఆయన సోదరుడితో పాటు ఈ కేసులో మరి కొంతమంది బంధువులు ఉన్నట్లుగా పోలీసులు గాలేస్తున్నారట.


అయితే వైసీపీ పార్టీలో దళితనేతగా మంచి పేరు సంపాదించిన సురేష్ బాపట్ల ఎంపీగా కూడా పనిచేశారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కూడా పేరు సంపాదించారు. అయితే టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సురేష్ పైన కఠినమైన వ్యాఖరి వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే 90 రోజులపాటు నందిగామ సురేష్ ని జైలులో ఉంచారు. అదేవిధంగా మరికొన్ని కేసులు కూడా నమోదు అవ్వడంతో ఆయన కోర్టు, పోలీస్ స్టేషన్ల మధ్య తిరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు కూడా మరొకసారి కేసు నమోదు కావడంతో ఏంటా పరిస్థితి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: