
అంటే క్వార్టర్ బాటిల్ పై ₹10 చొప్పున ధర పెరగనుంది. ఉదాహరణకు ఒక ఫుల్ బాటిల్ ధర ₹1000 ఉంది అనుకుంటే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం.. ఆ ఫుల్ బాటిల్ ధర 1040 రూపాయలు అవుతుంది. అంటే మందుబాబులపై 40 రూపాయలు అదనంగా భారం పడబోతోంది. అయితే 500 రూపాయల లోపు.. ధర ఉన్న ఫుల్ బాటిల్లపై ధర పెంచుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఫుల్ బాటిల్ ధర 40 రూపాయలు పెంచుతున్నట్లు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ నిర్ణయం నేపథ్యంలో... మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే బీర్ల ధరలు పెంచి ఇప్పుడు... లిక్కర్ ధరలను పెంచడం ఏంటని ఫైర్ అవుతున్నారు. పొద్దు మొత్తం కష్టపడి.... రాత్రి అయితే 90 ఎం.ఎల్ వేద్దామని.. అనుకుంటే ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచడం దారుణమని ఫైర్ అవుతున్నారు మందుబాబులు. కాగా తెలంగాణ ప్రభుత్వ ఆదాయం క్రమక్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో... ఆదాయాన్ని పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా లిక్కర్ ధరలను పెంచిందని చెబుతున్నారు ప్రతిపక్ష నాయకులు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు