
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగాలు చేసి జనసేన - బిజెపి నేతలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన నియోజకవర్గాలలో కీలక నేతలకు కూడా పదవులు కట్టబెడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ... ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు సైతం ఏకంగా అధిష్టానానికి ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్ కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా చంద్రబాబు - లోకేష్ తో అమితుమి తేల్చుకునేలా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానాడులో అఖిలప్రియ మాట్లాడుతూ పార్టీకి మాకు అంకితమై పని చేసిన వాళ్లకే పదవులు వచ్చేలా చేస్తానని మాట ఇచ్చారు.
శ్రీకాంత్ అన్న పార్టీకి .. మా కుటుంబానికి చాలా వరకు అండగా ఉన్నారు. నేను లోకేష్ అన్న దగ్గరికి శ్రీకాంత్ అన్నను తీసుకుపోయి మొదట నుంచి చేస్తున్న పనులు గురించి ప్రొఫైల్ ఇచ్చి .. అలాగే చంద్రబాబుకు కూడా ప్రొఫైల్ ఇచ్చి వచ్చాము .. కానీ అదే మండలం నుంచి ముక్కు మొహం తెలియని వారు ఎవరైనా వెళ్లి పదవి తెచ్చుకుంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వాళ్లను అడుగుపెట్టనివ్వను అని హెచ్చరిస్తున్నా అని సంచలన కామెంట్ చేశారు. నాకు తెలియకుండా ఎవరికైనా చిన్న స్థాయి నాయకుడికి పదవి ఇచ్చినా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగుపెట్ట నీయను అని అఖిలప్రియ హెచ్చరించిన తీరు ఇప్పుడు తెలుగుదేశం వర్గాలలో ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు