
మద్యం ప్రభుత్వమే విక్రయిస్తే లంచాలు ఇస్తారా లేక మద్యం అమ్మకాలను ప్రైవేట్ పరం చేస్తే లంచాలు ఇస్తారా అని జగన్ ప్రశ్నించడం గమనార్హం. తమ పాలనలో మద్యానికి సంబంధించి కుంభకోణం జరగలేదని ఆయన అన్నారు. తమ పాలనలో, కూటమి పాలనలో మద్యం అమ్మకాలకు సంబంధించి ఏ విధంగా జరిగాయో ప్రజలే ఆలోచించాలని జగన్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
బాబు పాలనలోనే మద్యం ఎమ్మార్పీతో పోలిస్తే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిస్టిలరీలలో 20 డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు బాబు సర్కారే లైసెన్స్ ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. తమ పాలనలో మద్య అమ్మకాలు తగ్గాయని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పాలనలో కొన్ని కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా చేసే ఛాన్స్ ఇచ్చామని జగన్ వెల్లడించారు.
గతంలో సీసీఐ ద్వారా వెలువడిన తీర్పును ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించడం కొసమెరుపు. మద్యం అమ్మకాలు తమను పారదర్శకంగా జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఈ సందర్భంగా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రభుత్వం బెదిరిస్తోందని ఆయన కామెంట్లు చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు