ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు నిధులు , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు , సంక్షేమ పథకాల గురించి చర్చలు జరుపుతున్నారు .. అలాగే ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు .. కూట‌మి పార్టీల ఎంపీలు ఉన్నత‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు .. ఇది పెద్ద విషయం కాదు .. ఇదే క్ర‌మంలో కేంద్ర రక్షణ మంత్రి రాజునాథ్ సింగ్ తో వీరిద్దరు కలిసి పాల్గొన్న సమావేశంలో ఆయన పక్కనే సీఎం చంద్రబాబుకి కుర్చీ వేసి గౌరవించడం ఇప్పుడు పెద్ద విశేషంగా మారింది ..


అయితే గతంలో  వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ ఢిల్లీ వెళ్లి వస్తూ ఉండేవారు .. ప్రధాని మోదీ ,హోం మంత్రి అమీషాలతో ఏకాంతంగా భేటీ అవుతూ ఉండేవారు .. కానీ ఇలా మంత్రులు , ఎంపీలను వెంటబెట్టుకుని వెళ్లి కేంద్ర మంత్రులతో ఈ విధంగా సమావేశాల్లో పాల్గొన్న సందర్భాలు ఎంతో తక్కువ .. అలాగే అప్పుల కొరకు కేసుల భయంతోనో ప్రధాని మోడీ అమిత్ షాల పట్ల జగన్ ఎంతో వినయ విధేయంగా ఉండేవారు .. అయినప్పటికీ ఢిల్లీ వెళితే ఇటువంటి సమావేశాలు కాదు కదా కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేదికాదు ..



గతంలో ఒక్కోసారి జగన్ ఢిల్లీ  వెళ్లిన కూడా ప్రధాన మోడీ అపార్ట్మెంట్ కూడా ఉండేది కాదు ..  పీఎం ఆఫీసు ముందు గంటలు తరబడి ఎదురు చూస్తూ అక్కడే ఉండాల్సి వచ్చేది .. విజయవాడ తిరిగి వెళ్ళిపోయారని రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ బిజెపి నాయకుడు ఈ విషయాన్ని బయటపెట్టారు .. కానీ ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై లోతుగా చర్చలు జరిపారు అంటూ అయన సొంత మీడియాలో పలు డబ్బా వార్తలు వాయించుకునే వారు అంటూ ఆ బీజేపీ నాయకుడు చెప్పుకొచ్చారు .. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుకి జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఫోటో సరిపోదా ..?

మరింత సమాచారం తెలుసుకోండి: