తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసిఆర్ సీఎం అయ్యారు. ఇదే తరుణంలో కేసీఆర్ వెంట తన ఫ్యామిలీ వ్యక్తులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, కవిత మాత్రమే పది సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా ప్రజలకు దగ్గరగా ఉన్నారు. పార్టీలో ఏం జరిగినా  ఏ నిర్ణయాలు తీసుకున్న ఈ నలుగురు మాత్రమే ఖరారు చేసేవారు. దీంతో బిఆర్ఎస్ పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా  కాస్త వ్యతిరేకత ఏర్పడింది. చివరికి ఈ వ్యతిరేకత పార్టీ అధికారంలో నుంచి దూరమయ్యేలా చేసింది. కుటుంబ పాలన బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేసి మూడవ దఫా అధికారంలోకి వచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఏ పని చేసినా కేవలం కేటీఆర్ కు మాత్రమే  ప్రాధాన్యత అందిస్తున్నారు. దీని తర్వాత హరీష్ రావు ఉన్నారు. 

పూర్తిగా కవితను పక్కన పెట్టడంతో ఆమె హర్ట్ అయిపోయి  కేసీఆర్ కు సీక్రెట్ గా ఒక లేఖ రాసింది. చాలా కాలం క్రితం రాసిన ఆ లేఖ తాజాగా బయటకు రావడంతో టిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు కవిత పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరబోతుందని లేదంటే కొత్త పార్టీ పెట్టబోతోందని చాలామంది అనుకుంటున్నారు. ఇదంతా బయటకు వచ్చిన తరుణంలో  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన చెల్లెలు కవితకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.. కవిత చేసిన ఆరోపణలపై నేను స్పందించనని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని  ఒకరికొకరు లేఖలు రాసుకోవడం సహజమని తెలియజేశారు.

అందులో భాగంగానే కవిత రాసిన లేక పెద్ద విషయం కాదని అన్నారు. టిఆర్ఎస్ లో అందరం కార్యకర్తలమని, కవిత కూడా కార్యకర్త లాంటిదే అంటూ స్పష్టం చేశారు. ఇలా అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు అంటూ చురకలాంటించారు. మేమంతా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నామని అందరం కార్యకర్తల లాగే ఉంటామని ఈ లేఖ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పగానే చెప్పారు. ఈ విధంగా కవితను పట్టించుకోవాల్సిన పనిలేదని ఒక గడ్డి పరకాల తీసివేశారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: