
పసుపు జెండా ఎత్తిన కార్యకర్తలు దించకుండా చూశారని ప్రతి కార్యకర్తకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ లోకేష్ తెలిపారు. పేదల కడుపు నిండా భోజనం పెట్టేందుకే టిడిపి పార్టీ ఉన్నదని.. ఈసారి కొత్తగా 58 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి ఉన్నారు అంటే తెలిపారు.. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మంది కొత్త ఉపాధ్యాయులు కూడా రాబోతున్నారని తెలిపారు. సొంత చెల్లిని తల్లిని గెంటేశారు అర్థమైందా రాజా అంటూ చాలామంది ఎద్దేవ చేసేలా చేశారని.. టిడిపి పార్టీకి ప్రతిపక్షం కొత్త ఏమి కాదు అధికారం కూడా కొత్తేమీ కాదు అంటూ నారా లోకేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నామంటూ తెలిపారు..
1). తెలుగుజాతి విశ్వఖ్యాతి
2). యువ గళం
3). పేదల సేవల్లో సోషల్ రీజనింగ్
4). స్త్రీ శక్తి
5). అన్నదాతకు అండగా
6). కార్యకర్తలే అధినేత
వంటి ఆరు శాసనాలను మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. వీటిని లక్ష్యంగా చేసుకొని తాను ముందుకు వెళ్ళబోతున్నాను అంటు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మరి రేపు మరుసటి రోజు జరగబోయే కార్యక్రమాలలో ఏ ఏ విషయాలు చెబుతారో చూడాలి