
దీంతో ఈ విషయంపై ఈరోజు ఉదయం హైదరాబాదులో కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి మరి పోలీసులు మఫ్టీలో అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కొమ్మినేని పోలీసులను సైతం పలు రకాల ప్రశ్నలు వేశారు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి అరెస్టు వారంటూ లేకుండా తన ఇంటికి ఎలా వచ్చారు అంటు ప్రశ్నించారు?. అయితే పోలీసులు మాత్రం ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలియజేస్తూ ఆయనని అరెస్టు చేశారట.కానీ జర్నలిస్టు కమ్మినేని మాత్రం కేసు పైన ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానాన్ని చెప్పలేదట. పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా వాహనంలో తరలించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సాక్షి యాజమాన్యం కూడా అమరావతి మహిళల పైన జర్నలిస్ట్ విశ్లేషకులు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమరావతి మహిళలకు కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇలా అక్రమంగా అరెస్టు చేశారని కొమ్మినేని శ్రీనివాసరావు వెల్లడిస్తున్నారు. అలాగే తాను సీనియర్ సిటిజెన్ అని తనని ఎలా అరెస్టు చేస్తారు అంటూ పోలీసులను కూడా ప్రశ్నించారు.. ప్రస్తుతం తమలాంటి సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత పైన ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో ఇలా అరెస్టు చేస్తున్నారనే విధంగా వెల్లడిస్తున్నారు. సాక్షికి మాత్రం కొమ్మినేని అరెస్ట్ పెద్ద షాక్ అని చెప్పవచ్చు.