ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు పై ఇప్పుడు సర్వత్ర చర్చలు జరుగుతూ ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది కావస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఎమ్మెల్యేల పనితీరుపైన ప్రజలకు కూడా చర్చించుకునేలా చేస్తున్నారు. ఈ ఏడాది కేవలం ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మినహాయింపు ఇస్తే ఇతర ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఆశించిన స్థాయిలో లేదని ప్రజలలో సుమారుగా 30% వరకు గ్రాఫ్ తగ్గిపోయిందనే విధంగా చర్చలు జరుగుతున్నాయి.


2024 ఎన్నికలలో 80 మంది వరకు కొత్తవారు విజయాన్ని అందుకున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది అసలు ఇప్పటికీ ప్రజల మధ్యకి వెళ్లలేదట. కూటమి పార్టీలో టిడిపి 134 మంది ఉంటే అందులో మంత్రులను పక్కన పెడితే మిగిలిన వారిలో 70 శాతం మంది ప్రజలకు అందుబాటులోనే లేరట. కేవలం కొందరు మాత్రమే ప్రజల మధ్యకు వస్తున్నారని కొన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు కనిపించకపోవడం గమనార్హం. ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు పదేపదే హెచ్చరిస్తూ ఉన్నారు

ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది ఆఫీసులో నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నదట. మరి కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కలవడానికి వెళ్ళినా కూడా అందుబాటులో ఉండడం లేదని వాదన కార్యకర్తలు ప్రజల నుంచి వినిపిస్తోంది. అలా ప్రజలకు ఎమ్మెల్యేలకు మధ్య కనెక్టివిటీ బాగా తక్కువగా ఉందనే విధంగా ఇప్పుడు ఏపీ అంతట ఈ టాక్ జోరుగా వినిపిస్తున్నది. ఎన్నికల సమయంలో 100% గ్రాఫ్ సాధించామని చెప్పుకుంటున్న కూటమి ఇప్పుడు అది 70 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూటమి నేతలు, అధినేతలు అలర్ట్ కాకుంటే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పలు రకాల సర్వే సంస్థలు కూడా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: