
అయితే ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరమే మొదలయ్యింది. ఈ మధ్యకాలంలో 15 సార్ల వరకు చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.. స్కూల్స్ తెరిచే నాటికి ఇస్తామని ఒకటి.. అలాగే టీచర్ల నియామకాలు డీఎస్సీ ద్వారా పూర్తి చేసి వాళ్లని నియమించేస్తాము అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా ఇచ్చేస్తామని తెలిపారు..ఇంకా టీచర్ల నియామకాలు ,విషయం ఫలితాలు అన్ని వచ్చేలోపు ఆరు మాసాలు పైనే పడుతుంది. ఇక్కడ మాట తేడా వచ్చింది.. అయితే ఇప్పుడు తల్లికి వందనం వచ్చేటప్పటికి ఈ నెలలో డేట్ ప్రకటిస్తామంటూ తెలుపుతున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ పథకం కోసం సమయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇది సరైన పద్ధతేన అన్నట్టుగా పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఈ ఏడాది అయిన తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్ వంటివి సదుపాయాలను కల్పిస్తారేమో చూడాలి మరి. సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం కోసం 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఎన్నో హామీలను కూడా ప్రకటించారు ఇప్పటివరకు అందులో రెండు మూడు హామీలు తప్ప మరేవి అమలు చేయలేదని తీవ్రస్థాయిలో నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు.