విమాన చరిత్రలోని ఒక ఘోరమైన విషాద సంఘటన ఈరోజు జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం టేకఫ్ అవుతున్న సమయంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులలో కేవలం ఒక్కరు మాత్రమే బతికినట్లుగా తెలుస్తోంది. దీంతో యావత్ ప్రపంచాన్ని ఈ విమాన ప్రమాదం షాక్ కు గురిచేసింది. రమేష్ విశ్వాస్ కుమార్ అనే యువకుడు మాత్రమే బ్రతికారు. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేకమైన హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇలాంటి సందర్భంలో ఈ విమాన ప్రమాదం పైన తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టాటా గ్రూప్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్ర శేఖరన్ తమ ట్విట్టర్ నుంచి ఒక ట్విట్ చేశారు. విమానంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించబోతున్నామంటూ కీలకమైన ప్రకటన చేశారు. ఇలా జరగడం చాలా విషాదమైన ఘటన.. తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నామని..అలాగే క్షతగాత్రులకు కూడా వైద్యు ఖర్చులను కూడా తామే భరిస్తామంటూ తెలియజేశారు.. అలాగే ధ్వంసం అయిన బీజే మెడికల్ కాలేజీని కూడా కొత్త భవనం కట్టిస్తామంటూ చంద్రశేఖరన్ హామీ ఇవ్వడం జరిగింది.


అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకఫ్ అయిన కొన్ని సెకన్ల లోపే  విమానం ఇలాంటి ప్రమాదానికి గురి కావడం జరిగింది. అయితే విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా మృతి చెందారు. ఈ విషయం అటు రాజకీయాలను, సినీ ప్రముఖులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా ఎలాంటి పరిణామాలు విమానం లోపల చోటు చేసుకున్నాయనే విషయాలను మరికొన్ని గంటలలో అధికారులు బయట పెట్టబోతున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ విమానం కూలిపోయిన 30 రోజుల వరకు సిగ్నల్ ని పంపిస్తుందట. ఇది ఎక్కడ ఉన్నా కూడా సిగ్నల్ ని పంపిస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: