ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికి ఏడాది పాలనను పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం బిజెపి న్యాయకత్వంతో జతకట్టి సజావుగా ఏడాది పాలనను పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. కూటమిలో జతకట్టడం వల్ల బిజెపి పార్టీకి 8 సీట్లు దక్కడం గమనార్హం. అలాగే ఒక మంత్రి పదవి కూడా లభించింది. అలాగే ముగ్గురు ఎంపీలను కూడా బిజెపి పార్టీ గెలుచుకుంది. వీటికి తోడు రెండు రాజ్యసభ సీట్లతో పాటు ఒక ఎమ్మెల్సీ సీట్లను కూడా సంపాదించింది. అలా కూటమిలో బిజెపి కూడా చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు.



కానీ కూటమిలో కీలక పాత్ర బిజెపినే నడిపిస్తోందనే విధంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా టిడిపి పార్టీ ఎక్కువగా జగన్ మీద వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నది. చాలామంది నేతల మీద ఇప్పటికే కేసులు పడ్డాయి. కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఇలాంటి వ్యవహారం మీద బిజెపి పెద్దగా రియాక్షన్ అవ్వలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట తిరుపతి లడ్డు విషయంలో జగన్ ని టార్గెట్ చేస్తూ కల్తీ నెయ్యి వాడారనీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారాన్ని జనసేన టిడిపి కలిసి చాలా పెద్ద ఎత్తున దుమారం చేశారు కానీ బిజెపి మాత్రం పెద్దగా కనిపించలేదు.


ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలయ్యిందని వైసీపీ ప్రభుత్వమే చేసింది అంటూ టిడిపి ఆరోపిస్తూ ఉన్న ఈ విషయంలో బిజెపి మాత్రం పరిమితంగానే రియాక్ట్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ లిక్కర్ స్కామిని తెర మీదకి తీసుకోవచ్చారు. ఇందులో కేసులు మీద కేసులు పెట్టి ఆఖరికి జగన్ ని కూడా అరెస్టు చేస్తారని ఒకానొక దశలో ఎక్కువగా వినిపించింది. ఈ మూడు విషయాలన్నిటిలో కూడా టిడిపి ఉత్సాహం చూపించిన బిజెపి మాత్రం సౌండ్ చేయలేదు.

బిజెపి పార్టీ ఏపీలో కూడా బలోపేతం కావడానికి పలు రకాల వ్యూహాలను రచిస్తోంది అందుకే టిడిపి వంటి ప్రాంతీయ పార్టీ అజెండాను మాత్రం అనుసరించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు వచ్చిన సమయంలో కూడా మోదీ జగన్ మీద ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు.. కూటమికి వైసీపీ పార్టీ ప్రత్యర్థి అయిన ఆ ప్రస్తావన బిజెపి మాత్రం తీసుకురాలేదు. ఏపీలో టీడీపీ వైసీపీ రాజకీయంగా భద్ర శత్రువులుగా మారుతున్నారు.. కానీ బిజెపి నుంచి ఎటువంటి విమర్శలు చేయకపోవడంతో వైసిపి పార్టీకి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.రాబోయే రోజుల్లో పార్టీల మద్దతు అవసరం ఉంటుంది కనుక కేంద్రం ఏ విధంగా స్పందించలేదని విధంగా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: