మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కుంభకోణాలు జరిగిన సమయంలో తాము ఆధారాలతో సహా అరెస్టులు చేశామని అయితే ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ తమ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని ఇప్పుడు ఆధారాలు సృష్టించి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొందని వైసీపీలో వినిపిస్తోంది. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అరెస్ట్ లపై ఈ అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

అయితే కూటమి  తీరు సరికాదని  సరికొత్త సాంప్రాయానికి కూటమి సర్కార్  తెర  లేపుతోందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  ఈ పరిస్థితులు రిపీట్ అయితే భవిష్యత్తు  దారుణంగా  ఉండబోతుందని  విశ్లేషకులు సైతం చెబుతున్నారు.  స్వయంగా  జగన్ నుంచి కూడా ఇవే అంశాలు  వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందని చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది.

రాబోయే రోజుల్లో జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.  జగన్ సూటి ప్రశ్నలకు జవాబులున్నాయా..  ఈ కామెంట్లపై టీడీపీ  నేతలు స్పందిస్తారా? అనే  చర్చ సైతం  మొదలైంది.  జగన్ చేసిన ఆరోపణల్లో  నిజం ఉందని  నెటిజన్లు  భావిస్తున్నారు.  ఇలాంటి వాటి నుంచి నక్సలిజం పుడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీహార్  చేసే విషయంలో బాబును మించి  ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు.

చెవిరెడ్డిని, చెవిరెడ్డి కొడుకును సైతం వదల్లేదని  ఆయన తెలిపారు. చంద్రగిరిలో చంద్రబాబును ఓడిస్తే కుప్పంకు వెళ్లారని  చంద్రగిరిలో రాజకీయాలు చేయడం కోసం  అక్కడ ఉండే నేతలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొందని  చెప్పుకొచ్చారు.   జగన్ స్పీచ్ విషయంలో నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు  వ్యక్తమవుతున్నాయి.  జగన్ కు ప్రజల ఉంచి సపోర్ట్ అయితే అంతకంతకూ పెరుగుతోందని చెప్పవచ్చు.  మాజీ సీఎం పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన  బాధ్యత జగన్ పై అయితే ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: