
ఇరాన్ - ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర ఉగ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా రంగంలోకి దిగింది . ఇరాన్ లోని అను కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ B2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ పై దాడులు చేయించాడు ట్రంప్. ఇరాన్ గగనతలంలో బయట నుంచి ఈ దాడులు చేయడం గమనార్హం. ఈ దాడుల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు . అంతేకాదు ఇరాన్ కి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు .
ట్రంప్ మాట్లాడుతూ.." మీకు శాంతి కావాలా..? విషాదం కావాలా..? మీరే తేల్చుకోండి. శాంతిని నెలకొల్పకపోతే దాడులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది . ఇజ్రాయిల్ తో కలిసి పని చేస్తాము.. తద్వారా ఇరాన్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది . ఇరాన్ శాంతిని కోరుకోకపోతే మిగిలిన లక్ష్యాలు అన్నిటిని అంతం చేస్తామంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్". దీంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ చెప్పిన ఒక మాస్ డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది . బాలయ్య ఏ డైలాగ్ చెప్పిన సరే పర్ఫెక్ట్ గా ఉంటుంది . అయితే చాలామందికి నచ్చింది మాత్రం ఇదే. "నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు తప్పితే వేరే ఏది పని చేయకూడదు . లేకపోతే నీకు నెక్స్ట్ బర్త్డ డే ఉండదు" అంటూ తనదైన స్టైల్ లో బాలయ్య డైలాగ్ చెప్తాడు. అదే విధంగా ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడు అని "శాంతి కావాలా ..? విషాదం కావాలా..? నేను చెప్పేటప్పుడు నీ చెవులు తప్పిస్తే మరి ఏది పనిచేసిన నీ కంట్రీ పేరు మ్యాప్ లో ఉండదు అంటూ డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చాడు " అంటూ రకరకాల మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి . అమెరికా మిలిటరీ ఇరాన్ లోని మూడు అను కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ఆ ప్రాంతాలను ధ్వంసం చేసింది .