ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న అవినీతి ఎక్కువగా పేరుకుపోయిందంటూ మాజీ టిడిపి నేత సుగవాసి బాలసుబ్రమణ్యం పలు రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవినీతి జరగలేదంటున్న కూటమి ఎమ్మెల్యేలు కాణిపాకంలో ఉండే దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ విసరడం జరిగింది. టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత టిడిపి పైన ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం తన సంచలనంగా మారింది. రాయచోటి ప్రాంతంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో సుగవాసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.


టిడిపి పార్టీ పైన ఫుల్ ఫైర్ అవుతూ రాష్ట్రంలో ధన ఉన్మాదం అధికార మేలుతోంది అంటూ ఆరోపణలు చేశారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు కూడా అన్నిచోట్ల అవినీతి జరుగుతోందన్నట్లుగా ఆరోపణలు చేశారు. ఈ అవినీతినీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినా కూడా ప్రయోజనం లేదంటూ అందుకే తాను టిడిపి పార్టీకి రాజీనామా చేశానంటూ తెలియజేశారు. సుమారుగా 40 ఏళ్ళు పాటు టిడిపిలో కొనసాగిన సుగవాసి కుటుంబం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


వైసిపి పార్టీకి రాజంపేట చాలా కీలకంగా  మారిందంటూ సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. టిడిపిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తాను సహించలేక టిడిపి పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చానని తెలియజేశారు. ఇలా వైసిపి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కొంతమంది టిడిపి నేతలు పైన పలు ఆరోపణలు చేశారు.. ఇసుక, మట్టి మాఫియా తో టిడిపి నేతలు చాలా దోచుకుంటున్నారనే విధంగా ఆరోపణలు చేశారు. దీంతో అటు సుగవాసి ఆరోపణలతో రాయచోటి, రాజంపేట నియోజకవర్గలలో కొంతమేరకు ఉలిక్కిపాటికి గురి చేసినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి టిడిపి పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరెవరెవరు పార్టీని వీడుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: