కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ముఖ్యమని చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలో ప్రత్యేకత ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతుండటం గమనార్హం. తెలంగాణాలో రామచంద్రారావు బీజేపీ అదేక్షునిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు అయింది.

తెలంగాణ రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.  రామచందర్ రావు ను నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించగా ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలని విషయంపై బిజెపి అగ్ర నేతలు తీవ్ర కసరత్తు చేయగా రామచందర్ రావు తోపాటు మరికొన్ని పేర్లు సైతం వినిపించాయి. అయితే కొందరు సీనియర్ నేతలు రామచందర్ రావు పేరును బలంగా ప్రతిపాదించినట్లు సమాచారం అందుతుంది.

అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంతోపాటు పార్టీని బలోపేతం చేయాలన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్న కొత్త అధ్యక్షుని పనితీరుపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బిజెపి అధ్యక్షుడు ఎంపిక కొలిక్కి వచ్చినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఏపీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేయగా గతంలో మాధవ్ బిజెపి ఫ్లోర్ లీడర్ గా పనిచేయడం జరిగింది.

 బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు అధ్యక్ష ఎన్నిక నిర్వహించ నుండగా కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించ నున్నారని సమాచారం అందుతోంది. కొత్త అధ్యక్షుల ఎంట్రీ నేపథ్యంలో  ఈ నేతలు  పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతారనే చర్చ జరుగుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: