ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన పథకం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ . 20 వేల రూపాయలు రైతులకు ఇస్తామని.. అయితే ఈ పథకాన్ని అమలు చేస్తూ త్వరలోనే ఇందుకు సంబంధించి డబ్బులను జమ చేస్తామని తెలిపింది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాలో 6000 మూడుసార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14000 ప్రతిఏటా కూడా కలుపుకొని వేస్తామని మొత్తం మీద 20 వేల రూపాయలు ఇస్తామని తెలిపింది కూటమి ప్రభుత్వం.


మొదటి విడతకు సంబంధించి మరో వారం రోజులలో రైతుల ఖాతాలు డబ్బులు జమ కాబోతున్నాయి. మొదటి విడత కింద కేంద్రం 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలు ఇలా మొత్తం మీద కలుపుకొని 7000 రైతుల ఖాతాలు జమ కాబోతున్నాయి. అయితే ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాను సైతం అధికారుల వద్ద సేకరించి ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు సచివాలయాలలో కూడా ఈ పథకానికి అర్హులను అందుబాటులో ఉంచారు.

అయితే ఒకవేళ ఈ పథకానికి అర్హత ఉండి లిస్టులో పేర్లు రైతులకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. రైతు సేవ కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించడానికి గ్రీవెన్స్ మాడ్యూలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉండి పేరు లేనివారు గ్రామ వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ రైతుల ఆధార్ నంబర్ నమోదు చేసి అర్హత ఉన్నాదో లేదో కూడా తెలుసుకోవచ్చు.. అన్ని అర్హత ఉండి రాకపోతే మరొక నెంబర్ 155251 అనే నెంబర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. అలాగే ప్రభుత్వ వెబ్సైట్..http://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: