
ఈ కేసు బదిలీతో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు మరింత లోతుగా జరిగే అవకాశం ఉంది.మే నెలలో న్యాయస్థానం నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఈ సమయంలో విజయనగరం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు కలిసి ప్రత్యేక విచారణ చేపట్టారు. నిందితులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉగ్రవాద భావజాలం కలిగిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. అహిం అనే పేరుతో ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు, బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సిరాజ్, అతని కుటుంబ సభ్యుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు గుర్తించారు.
విచారణ అనంతరం నిందితులను విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. సిరాజ్, సమీర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీలో కొందరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. విదేశాల్లో ఉన్న మరో ఇద్దరు నిందితులను రప్పించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అల్యూమినియం పౌడర్, సల్ఫర్ పౌడర్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు