గడిచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ వ్యవహారం తన సినిమా రిలీజ్ అయ్యే సమయంలో చేస్తున్నారని సినీ పెద్దలపైన ఆగ్రహాన్ని తెలియజేశారు. టాలీవుడ్ సినీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు తగిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకోసం టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు అనే విషయం పైన ఇటీవలే ఒక మీటింగ్ కూడా నిర్వహించి అందులో కొంతమంది పేర్లు లిస్టు కూడా సిద్ధం చేశారు. అయితే ఇందులో పలువురు స్టార్ సెలబ్రిటీలు, నిర్మాతలు దర్శకుల పేర్లు కూడా ఉన్నాయి.



జూన్ 15న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టాలీవుడ్ పెద్దలను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతా సిద్ధం అనుకున్న సమయంలో మీటింగ్ ని వాయిదా వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు సినీ పెద్దలందరూ కూడా సైలెంట్  గా ఉన్నప్పటికీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏదైనా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే చాలు తమ తమ పరిచయాల వల్ల ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ ధరలు పెంచుకునేందుకు కసరతులు చేస్తూ ఉంటారు నిర్మాతలు. అయితే మరి కొంతమంది మాత్రం అధిక ధరలు మాకెందుకు అంటూ సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే గత నెలలో కొన్ని కారణాల చేత వాయిదా పడిన ఈ భేటీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కానీ టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరికి వారు వెళ్లి మరి సినిమా టికెట్లు విషయంలో పర్మిషన్ తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా వినిపిస్తున్నాయి. సీఎంతో భేటీ అవ్వడం కోసం పెద్దగా తొందర పడాల్సిన పని లేదన్నట్లుగా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సిని ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య బాండింగ్ ఏర్పడాలి అంటే కచ్చితంగా సమావేశం అవ్వాల్సి ఉంటుంది. మరి ఈ విషయం పైన ఎప్పుడు కలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: