
OPT, H1Bపై మార్పులు … ఉద్యోగ భద్రత పై సందేహాలు .. OPT (Optional Practical Training) ప్రోగ్రామ్ పై భవిష్యత్తులో ఆంక్షలు రావొచ్చన్న వార్తలు, అలాగే H-1B వీసా లో ఉండే అనిశ్చితి, డిపోర్టేషన్ భయాలు భారత విద్యార్థుల ను మరింత వెనక్కి తగ్గిస్తున్నాయి . యూరప్ , కెనడా వైపు విద్యార్థుల పరుగులు .. వాటికి భిన్నంగా, విద్యార్థులు కెనడా, జర్మనీ, యూకే, న్యూజిలాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు . కెనడా లో భారత విద్యార్థుల సంఖ్య 15% పెరిగింది .. జర్మనీ లో ఈ సంఖ్య 20% పెరిగింది .. ఈ దేశాలు తక్కువ ఖర్చుల తో బోధన, మెరుగైన వర్క్ పర్మిట్ అవకాశాలు అందిస్తున్నాయి .
ఖర్చు భారమూ ఒక కారణమే .. అమెరికా లో ట్యూషన్ ఫీజులు , లివింగ్ ఎక్స్‌పెన్సెస్ , ఇన్సూరెన్స్ , విమాన ప్రయాణ ఖర్చులు - ఇవన్నీ కలిపి భారత విద్యార్థులకు ఆర్థికంగా భారంగా మారుతున్నాయి . రూపాయి విలువ పతనం అవుతుండటం , ఆ భారం మరింత పెరగడాని కి దోహదపడుతోంది. "అమెరికా డ్రీమ్" పై అస్పష్టత పెరిగిన వేళ, విద్యార్థులు క్లారిటీ ఉన్న, ఖర్చులు తక్కువ , ఉద్యోగ అవకాశాలు ఉన్న దేశాలవైపు పయనిస్తున్నారు. యూరప్ , కెనడా దేశాలు ఆ స్పేస్‌ను ఆక్రమిస్తున్నాయి .