2019 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకున్న వైసిపి 2024 ఎన్నికల్లో అందుకు భిన్నమైన ఫలితాలను అందుకోవడం వెనక వేరు వేరు కారణాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా ప్రజలను పూర్తిస్థాయిలో మెప్పించే విషయంలో కూటమి సర్కార్ ఫెయిల్ అవుతోంది. సంక్షేమ పథకాలను ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు.

మరోవైపు జగన్ పర్యటనలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ పర్యటనలకు వస్తున్న స్పందన కూటమి నేతల్లో గుబులు రేపుతోంది. తాజాగా జరిగిన బంగారు పాల్యం పర్యటనలో కార్యకర్తల నుంచి నేతల నుంచి ప్రజల నుంచి జగన్కు ఊహించని స్థాయిలో మద్దతు లభించిన నేపథ్యంలో జగన్ సైతం 2029 సంవత్సరంలో వైసీపీదే అధికారం అని చెబుతుండటం గమనార్హం.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తే జగన్ మాటలు నిజమయ్యే అవకాశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ప్రధానంగా ఇసుక విషయంలో కూటమి పాలనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అవినీతి సైతం పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో అమలైన కొన్ని మంచి పథకాలు ప్రస్తుతం అమలు కాకపోవడం కూడా కూటమికి ఒక విధంగా శాపం అయిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మరో నాలుగు ఏళ్ల పాటు కూటమి సర్కార్ కు అధికారం విషయంలో ఇబ్బందులు లేని నేపథ్యంలో ఇప్పటినుంచి జాగ్రత్త పడితే ఈ సమస్యలను కొంతమేర అధిగమించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు సైతం మంచి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. 2029 సంవత్సరంలో వైసిపి అధికారంలోకి రావడం పక్కా అని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది. జగన్ రాజకీయాల్లో  మళ్ళీ సంచలనాలు సృష్టించి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: