
ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని అన్నారు. రాబోయే రోజుల్లో సైతం మహమ్మారి వెంటాడుతోందని చెప్పుకొచ్చారు. అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.
జాగ్రత్తగా ఉండాలని భక్తులను ఆమె హెచ్చరించడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని మాతంగి స్వర్ణలత చెప్పుకొచ్చారు. బాల బాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారని కానీ నేను కడుపున పెట్టుకుని కాచుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశానని మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
మీ అరికాలిలో ముళ్ళు నాలుకతో తీస్తానని కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని నేను అడ్డురానని స్వర్ణలత వెల్లడించారు. అమ్మవారి ఎదురుగా వచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అయితే ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా ఆటంకం కలిగించారని ఆమె కామెంట్లు చేశారు.
ప్రతి సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదని నా కోరికను ప్రతి ఏడాది పక్కన పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలని పూజలు జరిపించని పక్షంలో నా కోపానికి మీరు బలవుతారని నా బిడ్డలే కాబట్టి నేను కోపం చూపించడం లేదని కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలి అనుభవిస్తారని ఆ సమయంలో నేను అడ్డురానని ఆమె అన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు