ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం ఎదురవుతోంది. ‘లిక్కర్ స్కామ్’ కేసులో కేంద్ర బిందువుగా మారిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్టు దశకు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సమీప వ్యక్తిగా భావించే మిథున్, ఈ స్కామ్‌ లో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరియు సిట్ సంస్థలు లిక్కర్ స్కామ్‌లో మిథున్ పాత్రను ప్రస్తావిస్తూ పలు ఆధారాలతో ముందుకు వస్తున్నాయి. మనీ రూటింగ్, డబ్బుల లావాదేవీలు, ఢిల్లీ ప్రభుత్వ సంస్థలతో సంబంధాలపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కేసులో భాగంగా జాతీయస్థాయి సంస్థలు గట్టిగా ఆరా తీస్తుండటంతో మిథున్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది.


కోర్టు ఆయనకు రక్షణ ఇవ్వడంలో విఫలమవడంతో, మిథున్ పారిపోయారు. ఆ వెంటనే ఆయన తరఫున పెద్ద పెద్ద లాయర్ల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, సుప్రీం కూడా ఈ కేసులో హైకోర్టు తీర్పును సమీక్షించేందుకు సిద్ధంగా లేదని తేల్చేసింది. ఆ సమయంలో మిథున్ తరపు లాయర్లు వారం రోజుల గడువు కావాలంటూ విజ్ఞప్తి చేసినా, సుప్రీం కోర్టు తిప్పికొట్టింది. దీంతో ఇప్పుడు మిథున్‌ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు ఆయన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఏసీబీ కోర్టులో వారెంట్ కోసం పిటిషన్ వేయడం ద్వారా అరెస్టు మార్గం సిద్ధమవుతోంది. అసలు లిక్కర్ స్కామ్‌లో మిథున్ పాత్ర ఏంటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, జగన్ తరఫున సీనియర్ లెవెల్ డీలింగ్స్‌ అన్నీ మిథున్‌ చూసేవారని, ముఖ్యంగా డబ్బుల నిర్వహణ, మధ్యం రవాణా, ఢిల్లీ లింకులు అన్నీ ఆయనే చక్కబెట్టేవారని తెలిసింది.

జగన్‌కు ప్రతి శనివారం లెక్కలు చెప్పేవాడట. ఈ సమాచారం అధికారికంగా బయటికి రాలేదు గానీ, దర్యాప్తు సంస్థలకు అందిన ఆధారాలు మాత్రం ఇదే చెబుతున్నాయి. ఇప్పటికే కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. సిట్ రెండు మూడు రోజుల్లో ప్రాథమిక చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. అందులో మిథున్‌ పేరు ఉండే అవకాశమూ ప్రబలంగా కనిపిస్తోంది. న్యాయపరంగా ప్రయత్నాలు విఫలమవడంతో, ఇప్పుడు మిథున్‌కు జైలు తప్పదని, రాజకీయ వర్గాలు తేల్చేశాయి. ఆయన్ను ఎక్కడ దొరికినా అరెస్టు చేయడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ‘లిక్కర్ స్కామ్’ నాయ‌కుల‌కు ఇది గట్టిపాఠం కావొచ్చని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మిథున్ అరెస్ట్‌తో జగన్‌ను టార్గెట్ చేసే ప్రయత్నాలు మరింత వేగవంతం కావచ్చన్నదే విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: