
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల అంశం చర్చించలేదని రేవంత్ చెప్పినా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామనాయుడు అదే ప్రధాన బనకచర్ల అని పేర్కొన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో రేవంత్ తెలంగాణ హక్కులను చంద్రబాబుకు అప్పగించారని ఆరోపించారు.
ఢిల్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను వదిలేసినట్లు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో రహస్య ఒప్పందం చేసుకుని, రాష్ట్రానికి ద్రోహం చేశారని విమర్శించారు. గోదావరి నది నీటిలో తెలంగాణకు 968 టీఎంసీలు, మిగులు జలాల్లో 1950 టీఎంసీలు కేటాయించేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. సీతారామ, కాళేశ్వరం, సమ్మక్క బరాజ్ వంటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను ఉపసంహరించాలని కోరారు. బనకచర్లకు అనుమతులు లేవని, దాన్ని కొనసాగించడం న్యాయం కాదని పేర్కొన్నారు.
తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బనకచర్ల విషయంలో అసత్యాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము కేంద్రంతో చర్చలు జరుపుతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యం కొనసాగాలని, అయితే తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రైతులకు నీరు, అభివృద్ధి అందించేందుకు తమ నిబద్ధతను కేటీఆర్ నొక్కిచెప్పారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు