ఈ మధ్యకాలంలో మనుషులు మృగాళ్ళా ప్రవర్తిస్తున్నారు.. నమ్ముకున్న వారిని మోసం చేస్తూ కుటుంబాలను హరించేస్తున్నారు.. అయితే యజమాని భార్యపై కన్నేసి  ఆ తర్వాత ఆమెను కిరాతకంగా మర్డర్ చేసి ఇబ్బందులకు గురి చేసిన రాక్షసుడి విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. యజమాని భార్యతో లైంగిక వాంఛను తీర్చుకోవడానికి ప్రయత్నించి ఆమెను చంపేసిన నిందితుడికి  బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితున్ని కఠినంగా శిక్షించాలని పేర్కొంది. యజమాని ఇంట్లోనే నివాసము ఉంటూ ఆయన భార్యని హత్య చేసి నిందితుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, కామ వాంఛతో ఆమె పట్ల నిందితుడు మృగంలా ప్రవర్తించి ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన తర్వాత ఆ మృతదేహంతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడని హైకోర్టు తీవ్రంగా మండిపడింది. 

నేర తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇలాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే సమాజంలో న్యాయస్థానాలకు చెడ్డ పేరు వస్తుందని కోర్టు ఆలోచన చేసింది. నెల్లూరు జిల్లా కావలిలో పశ్చిమబెంగాలు కు చెందిన శ్రీకాంత్ బిస్వాస్ తన తండ్రితో కలిసి  గత 16 సంవత్సరాలుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. వారి కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉంటూ ఆనందంగా గడిపేవారు. వారి సమీప బంధువైనటువంటి నయన్ బిశ్వాస్ కూడా తీసుకువచ్చి తన ఆసుపత్రిలో కాంపౌండర్ గా ఉద్యోగం ఇచ్చాడు. అయితే వీరిద్దరూ 2024 డిసెంబర్ 31న  మరో బంధువుతో కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత ఎవరి గదుల్లోకి వెళ్లి వారు నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి తన భార్య అర్పిత తన ఇంట్లో లేదు. అంతేకాదు ఆమె గదినిండా రక్తపు మరకలు ఉన్నాయి.

సమీపంలోని మురికి కాలువలో అర్పిత మృతదేహం పడి ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. ఆరోజు రాత్రి అర్పిత పట్ల నయన్ చాలా క్రూరంగా ప్రవర్తించి  ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. కానీ ఆమె నిరాకరించడంతో బలంగా కొట్టి  చంపి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక వాంఛ తీర్చుకొని మురికి కాలువలో పడేసాడని నిర్ధారించారు. అయితే దీనిపై నయన్ బిస్వాస్  బెయిల్ పిటిషన్  కోసం నెల్లూరు కోర్టులో  పిల్ దాఖలు చేశాడు. అంతా పరిశీలించిన కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన నయన్ కు చుక్కెదురైంది. అంతా పరిశీలించిన జస్టిస్ మల్లికార్జునరావు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: