వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  ప్రతిపక్షంగా ఉంది. నిజానికి ప్రతిపక్షంలో ఉంటే  తప్పకుండా అధికార పక్షం ఇచ్చినటువంటి హామీల గురించి ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల వైపు నిలబడాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి పని చేయకుండా అనవసర విషయాలు బయటకు తీసుకువస్తూ చివరికి పవన్ ట్రాప్ లో పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ వైసిపి వాళ్ళను కూడా నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. అలా ఎందుకు జరుగుతుంది..  కారణం ఏంటో చూద్దాం.. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేసింది. ఇందులో మహిళలకు 1500, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఇందులో 1500 రూపాయలు ఇవ్వమని చెప్పి అచ్చెన్నాయుడు ప్రకటించడం చూసాం. 50 ఏళ్ల పెన్షన్, బస్సులు జిల్లాకే పరిమితం అంటున్నారు. 

అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చేదాకా ఆగుతుంది అంటున్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ఎన్నో మాఫియాలు జరుగుతున్నాయి. అలాగే టిడిపి, జనసేన మధ్య అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇన్ని సమస్యలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసిపి వీటిపై మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ సినిమా అయినటువంటి హరి హర వీరమల్లు గురించి మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడటం వల్ల ఒక్క ప్రయోజనం అయినా వైసీపీకి కలగడం లేదు. దీనివల్ల పవన్ కళ్యాణ్ హైలెట్ అవ్వడమే కాకుండా ఆయన సినిమాకి కూడా ప్రమోషన్ దక్కుతోంది. నిజానికి వైసీపీ శత్రువు పవన్ కళ్యాణ్ కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ నే శత్రువుగా చూపిస్తూ అసలు శత్రువును పక్కన పెడుతున్నారు. ఇదే అదునుగా చూసిన పవన్ కళ్యాణ్, తాను ఎదగడం కోసం శత్రువును ప్రధానంగా వైసీపీని చూపిస్తూ తాను హైలైట్ అవుతున్నారు.

ఇదివరకు పవన్ కళ్యాణ్ టిడిపిని శత్రువుగా చేస్తే ఆయన రాజకీయంగా నిలవలేకపోయారు. దీంతో వైసీపీని శత్రువుగా చూస్తే ఆయన కాస్త అధికారంలోకి వచ్చి పదవి పొందారు. ఇదే తరుణంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం వైసీపీపై ఆరోపణలు చేస్తూ తానే బాస్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే తరుణంలో వైసిపి కూడా పవన్ ట్రాప్ లో పడిపోయి ఆయన సినిమా గురించి మాత్రమే మాట్లాడుతుంది. అసలు శత్రువు అయినటువంటి చంద్రబాబు,  ఆయన ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఈ విధంగా పవన్ ట్రాక్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పూర్తిగా పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి మాత్రమే మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తే వైసీపీకి రాబోవు రోజుల్లో మంచి విజయాలు ఉంటాయని తెలియజేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: